Switch to English

చంద్రబాబు.. హిమాలయాల నుంచి కిందకు దిగారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

చంద్రబాబు హిమాలయాలకు ఎప్పుడు వెళ్లారా అనుకుంటున్నారా? ఇది మంచు పర్వతాలైన హిమాలయాల గురించి కాదు.. ఏపీ ప్రజల సొమ్ముతో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తాగిన హిమాలయన్ మంచి నీళ్ల గురించి. అధికారంలో ఉన్నప్పుడు బాబు చేసిన దుబారా అంతా ఇంతా కాదని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు వినియోగించడం.. ఏ చిన్న పని చేసినా దానికి బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి ప్రచారం చేసుకోవడం వంటి అంశాలను వారు ప్రస్తావిస్తుంటారు. ఇక చంద్రబాబు సమీక్షలకు అరలీటరు రూ.60 ఉండే హిమాలయన్ వాటర్ బాటిళ్లను మాత్రమే వినియోగించేవారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ, ఇలాంటి విషయాల్లో ఎంత మాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మొత్తమ్మీద అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇలా పలు అంశాల్లో విపరీతంగా చేసిన ఖర్చుతో రాష్ట్ర ఖజానా దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓటమి చవిచూసిన చంద్రబాబు.. రెండు వారాలపాటు బయట ఎక్కడా కనిపించలేదు. అనంతరం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఎలాగో తెలుసా? ఎయిరిండియా విమానంలో. గరిష్టంగా రూ.15 వేల టికెట్ ఉండే సాధారణ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చి గవర్నర్ ని కలిశారు. అదే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం హైదరాబాద్ వెళ్లాలన్నా.. చెన్నై చేరుకోవాలన్నా.. ప్రత్యేక విమానాల్లోనే తిరిగేవారు. ఇక ఎన్నికల సమయంలో అయితే, కారులో తిరిగినట్టుగానే ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగారు.

ప్రస్తుతం అధికారానికి దూరం కావడంతో ప్రయాణాలు మామూలు విమానాలకు మారాయి. హిమాలయన్ వాటర్ బాటిళ్ల నుంచి బిస్లరీకి దిగారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అంతగా బయటకు రాని చంద్రబాబు.. తాజాగా సోమవారం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు బాటిల్ స్థానంలో హిమాలయన్ కు బదులు సాధారణ గ్లాసు దర్శనమివ్వడం గమనార్హం. పార్టీ నేతలకు సాధారణ బిస్లరీ వాటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరి చూసినవారు ప్రజల డబ్బు అయితే ఒకలా.. సొంత సొమ్ము అయితే మరోలా ఖర్చు చేస్తారా అనే సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొంది పాలనా పగ్గాలు చేపట్టిన జగన్.. చాలా సింపుల్ గా ఉండటం అధికారులను సైతం ఆకట్టుకుంటోంది. ఆయన సమీక్షా సమావేశాల్లో కిన్లే వాటర్ బాటిళ్లే కనపడుతున్నాయి. ఇకపై తమ సమీక్షల్లో హిమాలయన్ వాటిర్ బాటిళ్లు కనపడవంటూ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చెప్పినట్టుగానే అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు.

అయితే, జగన్ ప్రమాణ స్వీకారానికి చాలా తక్కువ ఖర్చుపెట్టామని వైఎస్సార్ సీనీ నేతలు చెబుతున్నప్పటికీ, ఆ కార్యక్రమానికి భారీగానే ఖర్చయిందని సమాచారం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పెట్టిన ఖర్చుతో పోలిస్తే తమది చాలా తక్కువ మొత్తమని వైఎస్సార్ సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక జగన్ సైతం ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రత్యేక విమానంలోనే తిరిగారు. గతంలో చంద్రబాబును విమర్శించిన జగన్.. తాను కూడా అలాగే వ్యవహరించారు. హైదరాబాద్, తిరుపతి ప్రత్యేక విమానాల్లోనే వెళ్లారు. చాలా విషయాల్లో పొదుపు పాటిస్తున్న జగన్.. ఈ విషయంలో కూడా ఖజానాపై భారం పడేలా వ్యవహరించకపోతే బాగుంటుందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Posts

టీడీపీలో పెద్దోడితో చిన్నోడి ‘కమ్మ’ని ఫైట్‌

చంద్రబాబుని తిడితే లాభమేంటి మోడీజీ!

సీఎం జగన్‌కి తొలి షాక్‌: బాబు, మోడీ ఒక్కటయ్యారా?

టీడీపీలో కేశినేని తిరుగుబాటు ఆరంభం మాత్రమేనా?!

5 COMMENTS

  1. I do not know if it’s just me or if perhaps everyone else experiencing problems
    with your blog. It looks like some of the text on your
    content are running off the screen. Can somebody else
    please comment and let me know if this is happening to them as well?
    This might be a issue with my internet browser because I’ve had this happen previously.

    Appreciate it

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...