Switch to English

బాలయ్య తనయుడు మోక్షజ్ఞకి ‘ఆ’ ఉద్దేశ్యం లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే ప్రయత్నాల్లో వున్నారు. ‘లెజెండ్‌’ సినిమా టైమ్‌లోనే ఈ చర్చ జోరుగా సాగింది. అయితే, ఆ తర్వాత పలు కారణాలతో మోక్షజ్ఞ తెరంగేట్రం వాయిదా పడుతూ వచ్చింది. తొలుత క్రిష్‌ చేతుల్లో మోక్షజ్ఞను బాలయ్య పెడతారని అంతా అనుకున్నారు. బోయపాటి శ్రీను పేరు తెరపైకొచ్చింది. పూరి జగన్నాథ్‌ కూడా రేసులోకొచ్చాడు. ఇలా, దర్శకుల పేర్లు.. క్యాలెండర్లు మారుతున్నాయ్‌గానీ, మోక్షజ్ఞ తెరంగేట్రం మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

ఈ మధ్యనే బాలయ్య తనయుడు చాలా సీరియస్‌గా కసరత్తులు చేసేసి, ఫిట్‌నెస్‌ సంపాదించుకుంటున్నాడనీ, పనిలో పనిగా విదేశాల్లో నటన, డాన్సులపై శిక్షణ కూడా తీసుకుంటున్నాడనీ వార్తలొచ్చాయి. మరోపక్క, బరువు కంట్రోల్‌లో పెట్టుకునేందుకు అవసరమైన శస్త్ర చికిత్సల్ని కూడా ఆశ్రయించినట్లు పుకార్లు విన్పించాయి. అయితే, నందమూరి క్యాంప్‌ నుంచి మోక్షజ్ఞ తెరంగేట్రంపై మాత్రం ఎలాంటి స్పష్టతా రాలేదు.

తాజాగా మరో ఆసక్తికరమైన గాసిప్‌ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అసలు మోక్షజ్ఞకి సినిమాల్లోకొచ్చే ఉద్దేశ్యం లేదనీ, ఆయనిప్పుడు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాడన్నది ఆ గాసిప్‌ సారాంశం. ఇంత చిన్న వయసులో మోక్షజ్ఞ రాజకీయ ఆలోచనలు చేయడమేంటని నందమూరి అభిమానులు కూడా విస్తుపోతున్నారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలయ్యాక, సినీ రంగం కన్నా రాజకీయాల గురించే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం నందమూరి మోక్షజ్ఞకు వచ్చిందని కొందరు అభిప్రాయ పడుతుండడాన్ని ఎలా తప్పు పట్టగలం.

తండ్రి నుంచి నటవారసత్వాన్ని స్వీకరించడం పెద్ద కష్టమేమీ కాదు. అదే, రాజకీయ వారసత్వం తీసుకోవాలంటే అనేక సవాళ్ళతో కూడుకున్న పని. మోక్షజ్ఞ ఆలోచన నిజంగానే అలా వుంటే, అతన్ని అభినందించి తీరాల్సిందే. కానీ, దానికి మోక్షజ్ఞ వయసు సరిపోదు. యంగ్‌ టైగర్‌కి చెక్‌ పెట్టేందుకో, మరో ఆలోచనతోనే నందమూరి క్యాంపే ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చిందని అనుకోవాలి. మరి, సినిమాల మాటేమిటి.? సినిమాల్లో కన్పించేందుకు తగ్గ లుక్‌తో మాత్రం ప్రస్తుతానికి మోక్షజ్ఞ కన్పించడంలేదు. సో, ఇంకాస్త టైమ్‌ అతని తెరంగేట్రం కోసం నందమూరి అభిమానులు వేచి చూడక తప్పదు.

Related Posts

హాట్ యాంకర్ ని గోకిన కుర్ర హీరో..!?

సన్నీలియోన్‌తో సునీల్‌ ‘చీకట్లో చితక్కొట్టుడు’

విద్య బాలన్ హాట్ ఫొటోస్

అల్లు శిరీష్‌ పెళ్ళంట.. ఆ హీరో కూతురితోనంట!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...