Switch to English

మంత్రి సీతక్క చేతుల మీదుగా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” లిరికల్ సాంగ్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను మంత్రి సీతక్క చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

మంత్రి సీతక్క మాట్లాడుతూ – తరతరాలుగా మహిళ ఈ సమాజంలో అణిచివేతకు గురవుతోంది. వారికంటూ ఉన్న ప్రత్యేకమైన రోజు ఈ ప్రపంచ మహిళా దినోత్సవం. మహిళలు పోరాడి సాధించుకున్న ఈ రోజున మహిళా గీత రచయిత చైతన్య పింగళి రాసిన ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను నా చేతుల మీదుగా రిలీజ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మధ్య తరగతి మనుషుల జీవితాలను ప్రతిబింబించే సినిమా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి”. మన గ్రామాల్లో నివసించే మధ్య తరగతి మనుషుల జీవితాల్లోని కథలు, వెతలు, భావోద్వేగాలన్నీ ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమా హీరో చైతన్య, ఇతర నటీనటులకు, దర్శకుడు కుమారస్వామి, మామిడి హరికృష్ణ, లిరిసిస్ట్ చైతన్య పింగళి…అందరికీ నా శుభాకాంక్షలు. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అని చెప్పారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ – మా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాలోని ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన మంత్రి సీతక్క గారికి కృతజ్ఞతలు. సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” కరీంనగర్ నేపథ్యంగా సాగే సినిమా అయినా ఇందులోని ఎమోషన్స్ యూనివర్సల్ గా ప్రేక్షకులు అందరికీ నచ్చుతాయి. కుమారస్వామి కొత్త దర్శకుడైనా సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ నెల 15న రిలీజ్ అవుతున్న మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ – మంత్రి సీతక్క గారు ఎంతో బిజీగా ఉన్నా మా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాలోని ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆమెకు మా టీమ్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ పాట మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఈ నెల 15న థియేటర్స్ లోకి “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా రిలీజ్ కు వస్తోంది. మీరంతా చూసి రెస్పాన్స్ తెలియజేస్తారని ఆశిస్తున్నా. అన్నారు

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – మంత్రి సీతక్క గారు మా సినిమా టీమ్ ను బ్లెస్ చేయడం హ్యాపీగా ఉంది. మా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాలోని ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మరికొద్ది రోజుల్లోనే మా సినిమా మీ ముందుకు రాబోతోంది. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా అన్ని కమర్షియల్ అంశాలు ఉంటూనే రియలిస్టిక్ మేకింగ్ తో ఆకట్టుకుంటుంది. అన్నారు.

‘ఆకాశం అందనీ..’ పాటకు చైతన్య పింగళి లిరిక్స్ అందించగా..నరేష్ అయ్యర్, నయన నాయర్ పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు కంపోజ్ చేశారు. ‘ఆకాశం అందనీ, నేలైనా పొందనీ, ఆటేదో ఆడితే ఇంతేనుగా మరి శూన్యాలే ఈసడి, బంధాలే ఓ ముడి, మందల్లే మారునా, ఆపేయునా కన్నీళ్లనీ..’ అంటూ ఎమోషనల్ గా సాగుతుందీ పాట.

39 COMMENTS

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, రానా...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 17 మార్చి 2025

పంచాంగం తేదీ 17-03-2025, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ తదియ సా. 4.57 వరకు,...

Chiranjeevi: అలుపెరుగని చిరంజీవి కీర్తి.. అదొక ప్రవాహం

Chiranjeevi: ఎంత చెప్పుకున్నా.. ఎంతెంత చదివినా.. మరెంత తెలుసుకున్నా.. చిరంజీవి జీవితం నిత్యనూతనం. సినీ ప్రస్థానం, సమాజ సేవలో సాధించిన విజయాలు, సంపాదించిన కీర్తి, అందుకున్న పురస్కారాలు ఇందుకు నిదర్శనం. జీవిత సాఫల్య...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

ఇరవయ్యేళ్ళు నిద్రపో జగన్: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సలహా.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ‘జయకేతనం’ పేరుతో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నిక జనసేన కీలక నేత...