Switch to English

Meter Movie Review: మీటర్ మూవీ రివ్యూ – నిద్రపుచ్చే మాస్ ఎంటర్టైనర్

Critic Rating
( 1.00 )
User Rating
( 1.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
Movie మీటర్
Star Cast రణ్ అబ్బవరం, అతుల్య రవి
Director రమేష్ కడూరి
Producer చిరంజీవి పెద్దమల్లు
Music సాయి కార్తీక్
Run Time 2 గం 7 నిమిషాలు
Release ఏప్రిల్ 7, 2023

Meter Movie Review: వరస సినిమాలతో దూసుకొస్తోన్న కిరణ్ అబ్బవరం నుండి వచ్చిన మరో చిత్రం మీటర్. మాస్ చిత్రమన్న కలరింగ్ ఇవ్వడం, మైత్రి మూవీ మేకర్స్ బ్యాకింగ్ ఉండటంతో మీటర్ పై అంచనాలు బాగానే కుదిరాయి. మరి కిరణ్ మాస్ హీరోగా సెటిల్ అవ్వాలన్న కల నెరవేరిందా?

కథ:

అర్జున్ కళ్యాణ్ తండ్రికి తన కొడుకుని పోలీస్ గా చూసుకోవాలన్నది ఆశ. అయితే అర్జున్ కళ్యాణ్ కు మాత్రం అది అసలు ఇష్టముండదు. కానీ అనుకోని కారణాల వల్ల అర్జున్ కళ్యాణ్ పోలీస్ అవుతాడు. ఇక అక్కడి నుండి ఎలాగైనా సస్పెండ్ అవ్వాలన్న కోరికతో అర్జున్ చేసే పనులు తిరిగి తనకే మంచి పేరు తీసుకొస్తాయి. సమాజానికి మంచి జరుగుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే ఒకరోజు హోమ్ మినిస్టర్ ను కలవాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో తన జీవితం మొత్తం మారిపోతుంది. ఇంతకీ అర్జున్ కళ్యాణ్ చేయాల్సిందేంటి? ఎందుకు కలవాల్సి వచ్చింది?

నటీనటులు:

కిరణ్ అబ్బవరం – ఇష్టం లేకుండా పోలీస్ అయ్యి, ఆ జాబ్ నుండి బయటకు వచ్చేయాలని చూస్తోన్న కుర్రాడి పాత్రలో బాగానే కనిపించాడు. అయితే పాత్ర చిత్రణ సరిగా లేని కారణంగా అటు హీరోయిన్ తో కిరణ్ చేసిన సన్నివేశాలు కానీ ఇటు విలన్ తో ఛాలెంజ్ సీన్స్ కానీ ఏదీ అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. ఒక దశ దాటాక కిరణ్ నటన రొటీన్ గా తయారవుతుంది. అయితే అందులో ప్రధానంగా నిందించాల్సింది స్క్రీన్ ప్లే నే.

ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన అతుల్య రవి పెద్దగా చేసిందేం లేదు. చూడటానికి చక్కగానే ఉన్న ఈ భామ లేకపోయినా సినిమాకు వచ్చే నష్టమంటూ ఏం లేదు. పోసాని కృష్ణ మురళి పర్వాలేదు, మిగిలిన వాళ్ళు మాములే.

సాంకేతిక వర్గం:

రమేష్ కడూరి ఒక రొటీన్ ప్లాట్ ను ఎంచుకున్నాడు. అయితే దానికి స్క్రీన్ ప్లే ప్రధానంగా మైనస్ గా మారింది. అనవసరంగా, అవసరానికి మించి సాగదీసిన చిత్రమిది. ఈ చిత్రం మొత్తంలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది కచ్చితంగా ఇంటర్వెల్ బ్లాక్ అనే చెప్పాలి. దానికి ముందు, తర్వాత జరిగే తతంగాన్ని భరించడం అంటే కష్టమే.

ఇక ఈ చిత్రంలో సంగీతం గురించి పెద్దగా చెప్పడానికంటూ ఏం లేదు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా. అసలే పేలవమైన సన్నివేశాలు ఇంకా పేలవంగా తయారయ్యాయి. ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. ఎడిటింగ్ ఈ సినిమాకున్న మైనస్ లలో మరొకటి.

ప్లస్ పాయింట్స్:

  • కొన్ని డైలాగ్స్

మైనస్ పాయింట్స్;

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • చిత్ర పేస్

విశ్లేషణ:

కనీసం గంట అయినా ఈ చిత్రాన్ని ఆసక్తిగా చూశారంటే వారికి చాలా ఓపిక ఉన్నట్లే అర్ధం. మీరు మరీ బోర్ కొట్టేసి, థియేటర్ లో ఏసి కోసం తప్పితే ఈ చిత్రాన్ని మొత్తం చూడాల్సిన అగత్యం ఎవరికీ పట్టదు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 1/5

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...