Rajasaab : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కల్కి సినిమా పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతూ ఉంటే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న విషయం తెల్సిందే.
మొన్నటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. అసలు సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయినా కూడా సినిమా గురించి ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తూనే వచ్చింది. సంక్రాంతికి సినిమా ఫస్ట్ లుక్ ఇవ్వడంతో అంచనాలు భారీగా పెరిగాయి.
తాజాగా దర్శకుడు మారుతి ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ.. రాజాసాబ్ సినిమా గురించి మాటల్లో చెప్పలేను అని, చేతల్లో చూపిస్తాను అంటూ దర్శకుడు మారుతి చెప్పుకొచ్చాడు. ఈరోజుల్లో, బస్ స్టాప్ వంటి చిన్న చిత్రాలు తీసిన నాకు ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం రావడం ఆనందం కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి వరకు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.