ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాను తీసిన దర్శకుడు రాధాకృష్ణ. ఈయన మొదటి సినిమా జిల్ గోపీచంద్ హీరోగా రూపొందిన విషయం తెల్సిందే. ఆ సినిమా కి స్టైలిష్ మూవీ అంటూ టాక్ వచ్చింది. జిల్ టేకింగ్ బాగున్న కారణంగా ప్రభాస్ తో సినిమాకు రాధాకృష్ణ ఎంపిక అవ్వడం, రాధేశ్యామ్ తీయడం, అది డిజాస్టర్ అవ్వడం తెల్సిందే.
రాధేశ్యామ్ డిజాస్టర్ తర్వాత రాధాకృష్ణ కెరీర్ పరిస్థితి ఏంటా అంటూ అంతా చర్చించుకుంటున్న సమయంలో అనూహ్యంగా గోపీచంద్ హీరోగా ఒక భారీ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమాను యుద్ద నేపథ్యంలో రూపొందించబోతున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విదేశాల్లో ఎక్కువగా యుద్ద సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. గోపీచంద్ మాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని రాధాకృష్ణ సన్నిహితులు అంటున్నారు.
ఇప్పటికే జిల్ మరియు రాధేశ్యామ్ సినిమాలను రాధాకృష్ణ తో నిర్మించిన యూవీ వారు మరో భారీ ప్రాజెక్ట్ ను ఆయనతో తీసేందుకు రెడీ అవ్వడం ఆసక్తికర విషయం. ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.