Hanuman : మొన్న సంక్రాంతికి విడుదల అయిన హనుమాన్ సినిమా రూ.300 కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు నమోదు చేసింది.
హనుమాన్ హిట్ నేపథ్యంలో హీరో తేజ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హనుమాన్ సినిమా కోసం రెండున్న ఏళ్లు కష్టపడ్డాం. ఈ రెండున్నర ఏళ్లలో నాకు 70 నుంచి 75 సినిమాల ఆఫర్లు వచ్చాయి. కానీ హనుమాన్ పూర్తి చేశాకే అనుకుని వెయిట్ చేశా.
హనుమాన్ సినిమా ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించలేదు. తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారని, అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆధరిస్తారని అనుకున్నాం అని తేజా అన్నాడు. 75 సినిమాలు వదులుకున్నందుకు హనుమాన్ తో ప్రతిఫలం దక్కింది. మరి తేజ తదుపరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.