Switch to English

అక్టోబర్ 27న ‘మార్టిన్ లూథర్ కింగ్’ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,964FansLike
57,764FollowersFollow

వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం “మార్టిన్ లూథర్ కింగ్”. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు.

వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం టీజర్ గాంధీ జయంతి రోజున విడుదలై అద్భుతమైన స్పందనను పొందింది. తెలుగు సినిమాలలో ఇదో కొత్త అనుభూతిని ఇస్తోంది. అలాగే ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు నటుడిగా ఆకర్షణీయమైన ఓ కొత్త పాత్రలో అలరించనున్నారు.

అక్టోబర్ 9 నుండి చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పర్యటనను ప్రారంభించారు. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు మరియు వరంగల్ వంటి నగరాల్లో ముందస్తు ప్రీమియర్‌ షోలను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 18న విడుదల కానుంది. అలాగే ఆ వారాంతంలో విడుదలవుతున్న భారీ చిత్రాలతో పాటుగా అక్టోబర్ 19 నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని 400 థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శించబడుతుంది.

‘మార్టిన్ లూథర్ కింగ్’ ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది.

‘మార్టిన్ లూథర్ కింగ్’ 2023, అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

1 COMMENT

సినిమా

ఐటీ దాడులతో ఆ ‘సినిమాల’ లెక్కలు తేలతాయా.?

ఓ సినిమా ఎంత వసూలు చేసింది.? ఎంత పెద్ద హిట్టయ్యింది.? ఈ విషయాల్ని వెల్లడించాల్సింది నిర్మాత మాత్రమే. బాక్సాఫీస్ లెక్కలంటూ సినీ మీడియాలో రాతలు కుప్పలు...

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి.. లక్ష్మీ మిట్టల్ ను...

దావోస్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అంశాలను వివరిస్తూ పెట్టుబడిదారులను...

రాజకీయం

డిప్యూటీ సీఎం పదవి ఎందుకంత స్పెషల్.!

ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో...

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్‌కేంటి నష్టం.?

నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ...

ఎక్కువ చదివినవి

ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” ఫస్ట్ సింగిల్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా'. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్,...

భారీ రికార్డు సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం.. రూ.100 కోట్ల షేర్..!

సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది....

‘సంక్రాంతికి వస్తున్నాం’తో బోణీ కొట్టా.. ఈ ఏడాదంతా బిజీనేః వీకే నరేశ్

2025 సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ట్ కావడం సంతోషంగా ఉందని సీనియర్ నటుడు వీకే నరేశ్ అన్నారు. జనవరి 20న ఆయన పుట్టిన రోజు సందర్భంగా...

తెలుగులోకి వస్తున్న సూపర్ హిట్ ‘ఐడెంటిటీ’.. ఎప్పుడంటే..?

మలయాళ మరో సూపర్ హిట్ మూవీ తెలుగులోకి రాబోతోంది. టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఐడెంటిటీ. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ డైరెక్ట్ చేశారు. రాజు మల్లియాత్, రాయ్...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 18 జనవరి 2025

పంచాంగం తేదీ 18-01-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు. తిథి: బహుళ పంచమి పూర్తిగా నక్షత్రం: పుబ్బ మ. 3.01...