Switch to English

‘మా ఊరి పోలిమేర 2’ ట్రైలర్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,982FansLike
57,764FollowersFollow

మా వూరి పోలిమేర‘కు సీక్వెల్ గా రాబోతున్న చిత్రం మా వూరి పోలిమేర 2. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రం నవంబరు 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రాన్ని చూసి ఎంతగానో నచ్చిన ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుతో కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన దర్శకుడు హరీష్ శంకర్, హీరో కార్తికేయ, నిర్మాత బన్నీవాస్ లు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ ఓటీటీలో పోలిమేర 1 బాగుందని చాలా మంది చెప్పారు. చూడగానే నాకు కూడా బాగా నచ్చింది. కంటెంట్ చాలా బలంగా వుంది. పోలిమేర 2 కూడా అదే తరహాలో బాగుంటుందని అనుకుంటున్నాను. బన్నీవాసుతో నాకు మంచి రిలేషన్ వుంది. ఆయన ఈ సినిమాకు సపోర్ట్ గా వుండి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం దర్శకుడికి సినిమాలంటే ఎంత ఇష్టమో ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మంచి తెలుగు టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతినిస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమాతో ఇందులో పార్ట్ అయిన నటీనటులకు సాంకేతిక నిపుణుల అందరికి మంచి పేరు వస్తుంది‘ అన్నారు. బన్నీవాస్ మాట్లాడుతూ ’నాకు నచ్చి నేను ఈ సినిమాకు సపోర్ట్ చేస్తాను. వంశీ చేస్తున్న తొలి సినిమా ఇది. 2018 సినిమాను చూసి తెలుగులో మనం విడుదల చేద్దామని సజెస్ట్ చేసిన వంశీ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. అతని జడ్జ్ మెంట్ పై నాకు నమ్మకం వుంది. ఇది చాలా చిన్న కథ తప్పకుండా అందిరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. సత్యం రాజేష్ కు కెరీర్ కు బాగా ప్లస్ అవుతుంది. పోలిమేర 3 కూడా వుంటుంది. మొదటి పార్ట్ చూడని వాళ్లకు కూడా పోలిమేర 2 అర్థమయ్యేటట్లు స్క్రీన్ ప్లే వుంటుంది. ఈ సినిమా అందరికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పోలిమేర2 కు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. హీరో కార్తీకేయ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ పై చూస్తే చాలా మంచి అనుభూతికి లోనవుతారు. చాలా కష్టపడి చేసిన సినిమాలా అనిపిస్తుంది. తప్పకుండా సినిమా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ నాకు అండగా వుంటూ, ఈ రోజు నేను ఈ స్థాయిలో వున్నానంటే బన్నీవాస్ కారణం. సినిమాను తప్పకుండా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అని తెలిపారు. గౌరికష్ణ మాట్లాడుతూ ఇలాంటి చిన్న సినిమాలకు అండగా వుండే బన్నివాస్, వంశీ నందిపాటి గారికి అభినందనలు, సినిమా విజయంపై మంచి నమ్మకం వుంది. నిజాయితీగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ ఈ సినిమా వంశీ నందిపాటికి నచ్చడంతో ఈ సినిమా ప్రయాణం ఇక్కడి వరకు రావడం ఆనందంగా వుంది. అన్నారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ హరీష్ శంకర్, కార్తికేయ, బన్నీవాస్ గారు ఈ వేడుకకు రావడం పాజిటివ్ గా అనిపిస్తుంది పార్ట్ 1కు మించి పార్ట్ 2 వుండబోతుంది. వంశీ నందిపాటి సినిమాను విడుదల చేయడం ఎంతో ఆనందంగా వుంది. ఈ సినిమాను పార్ట్ 1కు 100 రెట్లు ఎంజాయ్ చేస్తారు. బాలాదిత్య మాట్లాడుతూ నేను రాజేష్ సినీ పరిశ్రమకు వచ్చి
20 సంవత్సరాలైంది పోలిమేర చూసిన ప్రతి ఒక్కరూ పార్ట్ 2 ఎప్పుడూ అని అడిగారు. పార్ట్ 1కు మించి ఎన్నో రెట్లు అద్బుతంగా వుంటుంది. పార్ట్ 1ను చూడనివాళ్లు తప్పకుండా చూసి పార్ట్ 2కు వస్తే మీ మెదళ్లకు చాలా పని వుంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా వుంటుంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఈ సినిమాలో వుంటాయి. సత్యం రాజేష్ ఈ సినిమాతో పర్ ఫార్మెర్ అని నిరూపించుకున్నాడు‘ అన్నారు. ఈ వేడుకలో ఖుషేందర్, గెటప్ శీను, కామాకి, సాహితి
గ్యానీ తదితరులు పాల్గొన్నారు

సినిమా

డైరెక్టర్ త్రినాథరావుపై మహిళా కమిషన్ సీరియస్.. త్వరలోనే నోటీసులు..!

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వివాదంలో చిక్కుకున్నారు. మజాకా సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షుపై చేసిన అనుచిత కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి....

నారావారి పల్లెలో సంక్రాంతి సంబురాలు.. మహిళలకు భువనేశ్వరి కానుకలు..!

చంద్రబాబు నాలుగోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి వస్తున్న సంక్రాంతి పండుగ. దీంతో చంద్రబాబు కుటుంబం చిత్తూరు జిల్లాలోని నారా వారి పల్లెలో సంక్రాంతి సంబురాల్లో...

తెలుగు సినిమాకి ఈ సంక్రాంతి నేర్పిన గుణపాఠమిదే.!

ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయనగానే.. తెలుగు సినిమాకి మంచి రోజులొచ్చాయని అంతా అనుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ ఇప్పటికే...

చావైనా, బతుకైనా సినిమాల్లోనే ఉంటా.. రామ్ చరణ్‌ స్టేట్ మెంట్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్...

Majaka: ‘ప్రేక్షకులు కోరుకునే సినిమా ఇది..’ ‘మజాకా’ టీజర్ లాంచ్ లో...

Majaka: సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'మజాకా'. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ...

రాజకీయం

తిరుమల లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం..!

తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలోనే ఆలయ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ...

సంక్రాంతికి ఆంధ్ర ప్రదేశ్‌లో రోడ్ల పండగ.!

సంక్రాంతి పండక్కి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని సొంతూళ్ళకు వెళుతున్నారు చాలామంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని వెతుక్కునే క్రమంలో దేశంలోని నలు మూలలకూ వెళ్ళిపోయిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, ఏడాదికోసారి...

పవన్ నెక్ట్స్ టార్గెట్ సజ్జల.. అటవీ భూముల ఆక్రమణపై చర్యలు..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ త్వరలోనే కడప జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై లెక్కలు తేల్చబోతున్నారు. వైఎస్సార్ జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సర్వే...

జగన్ ఐదేళ్ల పనులను ఆరు నెలల్లో బద్దలు కొట్టిన పవన్..!

పవన్ కల్యాణ్‌ తన పరిధిలోని శాఖల పనితీరులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ పెద్దగా పట్టించుకోని ఆ శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక సరైన లీడర్ పనిచేస్తే ఆ శాఖల్లో ఎన్ని...

ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి...

ఎక్కువ చదివినవి

తిరుపతి ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 6 కు చేరుకుంది. వివిధ కేంద్రాల్లో తొక్కిసలాట చోటు చేసుకోగా వారిని రుయా, స్విమ్స్...

వీఐపీ లపై కాదు, సామాన్యులపై టీటీడీ దృష్టి పెట్టాలి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై బాధ్యత తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పవన్ అనంతరం ఆసుపత్రిలో...

Majaka: ‘ప్రేక్షకులు కోరుకునే సినిమా ఇది..’ ‘మజాకా’ టీజర్ లాంచ్ లో సందీప్ కిషన్

Majaka: సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'మజాకా'. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ స్టూడియోస్  బ్యానర్స్ పై రాజేష్ దండా,...

Squid Game: ‘స్క్విడ్ గేమ్’ లో మన స్టార్ హీరోలు.. గేమింగ్ డ్రెస్ లో ఏఐ ఇమేజెస్ వైరల్

Squid Game: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ ల్లో ఒకటి ‘స్క్విడ్ గేమ్’. ప్రస్తుతం ‘స్క్విడ్ గేమ్-2’ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 92 దేశాల్లో నెంబర్ 1...

Ram Charan: అభిమానుల కటుంబాలకు రామ్ చరణ్ ఆర్ధికసాయం.. చెక్కులు అందించిన ఏడిద బాబీ

Ram Charan: అభిమానుల ఆనందమే తమ ఆనందంగా హీరోలు.. హీరోల విజయమే తమ విజయాలుగా భావించే అభిమానులు. హీరో ఎవరైనా అభిమానులపై చూపే ప్రేమ ఇంతే. అటువంటి అభిమానులు దూరమవడం హీరోలను బాధించే...