Manchu Manoj: నిన్నటి వీడియో వివాదం మరవక ముందే మంచు మనోజ్ ( Manchu Manoj) చేసిన పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘ కళ్ళ ముందు జరుగుతున్న తప్పులను చూసి చూడనట్లు వదిలేయడం కంటే నిజం కోసం పోరాడుతూ.. ప్రాణాలు వదిలేయడానికైనా నేను సిద్ధం’ అని అర్థం వచ్చేలా ఇంగ్లీష్ కోట్స్ ను పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి చేశారోనని నెటింట్లో పెద్ద చర్చ జరుగుతోంది.
మంచు సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అయితే దీనికి ఊతమిస్తూ నిన్న మనోజ్ సంచలన పోస్ట్ చేశారు. ఇంట్లోకి వచ్చి తన వారిపై దాడి చేస్తున్నారంటూ వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో మంచు విష్ణు (Manchu Vishnu) ఆగ్రహంతో ఉన్నట్లు కనిపించడంతో అది సంచలనంగా మారింది.
మోహన్ బాబు (Mohan Babu) జోక్యంతో మనోజ్ ఆ వీడియోని డిలీట్ చేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మంచు లక్ష్మి( Manchu Lakshmi), మనోజ్ ఇంట్లో కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చాయి.