న్యాచురల్ స్టార్ నాని గత రెండు సినిమాలు ఓటిటిలో విడుదలై నిరాశపరిచినా కానీ లేటెస్ట్ గా విడుదలైన చిత్రం శ్యామ్ సింగ రాయ్ మాత్రం థియేటర్లలో సందడి చేసి పాజిటివ్ రిజల్ట్ ను దక్కించుకుంది. నాని పెర్ఫార్మన్స్ కు మరోసారి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ప్రస్తుతం నాని చేస్తోన్న రెండు సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న దసరా చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. కప్పేలా అనే చిత్రం ద్వారా రోషన్ అందరికి సుపరిచితమయ్యాడు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు.