Switch to English

స్థానిక పోరు: ‘ఏక’గ్రీవం.. వైసీపీ గొప్పతనమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫలానా చోట ఏకగ్రీవమయ్యిందనీ, ఇంకో చోట తమ పార్టీకి ఎదురే లేదనీ, మరో చోట ప్రజలంతా ముక్తకంఠంతో వైసీపీ వైపే నిలబడ్డారనీ.. అలా తమకు మెజార్టీ ఏకగ్రీవాలు దక్కాయనీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా చెప్పుకుంటోంది. నిజానికి, స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు కొత్త కాదు.. అవెలా జరుగుతాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

అధికార పార్టీ, తెరవెనుక బెదిరింపులకు పాల్పడటం.. తెర ముందు విధ్వంసాలకు పాల్పడటం సర్వసాధారణమే. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇదే చేసింది. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు అసలు నామినేషన్లే వేయకుండా చేయడంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఆ లెక్కన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత ఖచ్చితంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దక్కుతుంది.

మహిళలని కూడా చూడకుండా వైసీపీ నేతలు విపక్షాలకు చెందిన అభ్యర్థులపై భౌతిక దాడులు జరిపారు. ఓ మహిళా అభ్యర్థి తన జాకెట్‌లో నామినేషన్‌ పత్రాన్ని దాచుకుంటే.. దాన్ని కూడా లాక్కున్న ఘనులు వైసీపీ కార్యకర్తలు. ఇదీ, ఇంత గొప్పగా నామినేషన్ల పర్వం నడిచాక, ఏకగ్రీవాలు వైసీపీకి దక్కడంలో వింతేముంది.?

చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో నిస్సిగ్గు రాజకీయం ఆంధ్రప్రదేశ్‌లో జరిగితే, ‘ఇది మా గొప్పతమే..’ అని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. మరోపక్క పోలీసులు, ‘చిన్న చిన్న ఘటనల్ని బూతద్దంలో చూపుతున్నారు..’ అని వ్యాఖ్యానిస్తుండడం.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తీరుని చెప్పకనే చెబుతున్నాయి.

తమ గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెట్టి, ప్రజలంతా ఏకమై.. ఎన్నికల్ని ఏకగ్రీవం చేస్తే అదొక లెక్క. కానీ, పోలీస్‌ ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతల ఇళ్ళల్లో పార్టీలు చేసుకుంటూ, ఆ అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో ఇతర రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల్ని బెదిరిస్తే.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం.? అని ప్రధాన ప్రతిపక్షం సహా, ఇతర రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

ఈ స్థానిక ఎన్నికల్లోనే హత్యాయత్నం జరిగిందంటూ పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశాక.. ‘చిన్న ఘటనల్ని బూతద్దంలో చూపిస్తున్నారు’ అనడమేంటి కామెడీ కాకపోతే.? అన్నది ప్రజాస్వామ్యవాదుల సూటి ప్రశ్న.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...