ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. కెరీర్ ఆరంభంలో ఈ ముద్దుగుమ్మ బొద్దుగుమ్మగా పిలవబడేది. ప్రతిభ ఉన్న నటి కాని లావు కాస్త ఎక్కువ ఉంది అంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో దాదాపుగా పది కేజీల వరకు బరువు తగ్గింది. ప్రస్తుతం స్లిమ్‌గా ఆకట్టుకునే రూపుతో వెండి తెరపై మెరుస్తోంది. సక్సెస్ ఫ్లాప్స్‌తో ఈ అమ్మడు కెరీర్ అలా అలా సాగిపోతుంది.
ఇటీవలే ఈ అమ్మడు చాలా నమ్మకం పెట్టుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చడంతో ఈమె తదుపరి చిత్రం కోసం వెయిట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఈమెకు దేవా కట్టా సినిమాలో ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. నివేదా పేతురాజ్ ఒక హీరోయిన్గా నటిస్తుండగా మరో హీరోయిన్ పాత్ర కోసం రాశిఖన్నా ఎంపిక అయ్యిందట.
సాయి ధరమ్ తేజ్‌తో ఇప్పటికే రాశిఖన్నా ‘సుప్రీమ్’ ఇంకా ‘ప్రతి రోజు పండుగే’ చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. కనుక మరోసారి వీరిద్దరి కాంబోలో అంటే ఖచ్చితంగా హ్యాట్రిక్ అంటున్నారు. మెగా హీరోతో హ్యాట్రిక్ దక్కించుకుంటే రాశిఖన్నా కెరీర్లో మరో స్టెప్పు పైకి ఎదగడం ఖాయం అంటున్నారు. మరి దేవా కట్టా వీరిద్దరి కాంబోకు హ్యాట్రిక్‌ను ఇస్తాడా చూడాలి.
363743 23287bmmzyfixtirh cheapest phentermine zero health professional prescribed qrdzoumve buy phentermine diet pill iixqnjouukkebr 28501
944838 399852Some really great articles on this web site , thankyou for contribution. 895177
46719 173823Really interesting topic , appreciate it for posting . 999486
141306 291181As I web site owner I believe the content material material here is quite superb, thanks for your efforts. 650009