Switch to English

భూ రిజిస్ట్రేషన్‌ ధరల మోత: ఇటు ఇచ్చుడు.. అటు లాగుడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఓ వైపు సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు.. ఇంకోపక్క, ఖాళీ అవుతోన్న ఖజానాని నింపేందుకు ‘బాదుడు’ వ్యవహారాలు.. వెరసి, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు విమర్శలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్‌ ధరల్ని పెంచుతూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అసలు రాష్ట్రంలో భూముల ధరలు పెరిగితే కదా.. రిజిస్ట్రేషన్‌ ధరల్ని పెంచడానికి.? అన్న చర్చ సాధారణ ప్రజానీకంలో జరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భూముల ధరల్లో ఏమాత్రం పెరుగుదల కన్పించలేదు సరికదా.. గడచిన కొంత కాలంగా ధరలు తగ్గుతున్న పరిస్థితి కూడా కన్పిస్తోంది.

సాధారణంగా భూముల ధరలు పెరుగుతున్నప్పుడు రిజిస్ట్రేషన్‌ ధరల్ని కూడా పెంచుతుంటారు. కానీ, ఇక్కడ పరిస్థితి వేరు. ఖజానా నింపుకోవడానికి సులువైన మార్గంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ధరల పెంపును చూస్తోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

అసలే భూముల అమ్మకాలు జరగక ఇటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. అటు సాధారణ ప్రజానీకం లబోదిబోమంటోన్న వేళ రిజిస్ట్రేషన్‌ ధరలు మరింతగా పెరిగితే, ఈ రంగంలో ముందు ముందు మరింత స్తబ్దత నెలకొంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఊపు రావాలంటే, ఇసుక లభ్యత పెరగాలి. సిమెంట్‌ ధరలూ అందుబాటులో వుండాలి. ఈ అనుకూలతలు రాష్ట్రంలో గత కొంతకాలంగా కన్పించడంలేదు.

పైగా, రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు.. రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేందుకు సైతం ఏమాత్రం అనుకూలంగా లేకుండా పోయాయి. ‘ఏడాది కాలంగా భూముల ధరలు పెరగడంలేదు సరికదా, తగ్గిపోతున్నాయ్‌.. ధరలు తగ్గినా కొనుగోళ్ళు జరగడంలేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ధరలు పెరిగితే, అది మరింత చేటు చేస్తుంది..’ అంటూ రియల్‌ రంగానికి చెందిన వ్యాపారులు, వివిధ అవసరాల రీత్యా భూముల్ని అమ్ముకోవాలనుకుంటున్నవారు వాపోతున్నారు.

ప్రధానంగా అమరావతి ప్రాంతంలో అమ్మకాలు, కొనుగోళ్ళు నిలిచిపోవడంతో అక్కడ అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రిజిస్ట్రేషన్‌ ధరల పెంపుతో, ఇప్పటికే పడిపోయిన ప్రభుత్వ ఆదాయం మరింతగా పడిపోయే ప్రమాదం వుందని కూడా రియల్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏదిఏమైనా, ఇటు సంక్షేమ పథకాల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే, ఇంకోపక్క జనం జేబులు గుల్ల చేసేలా ప్రభుత్వం ‘ధరల పెంపుదల’ అన్ని విభాగాల్లోనూ చేపడుతుండడం గమనార్హం. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే పెట్రో ధరలు, మద్యం ధరలు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎక్కువగా వున్న విషయం విదితమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...