Switch to English

మార్షల్ ఆర్ట్స్ కాకుండా ఇకపై నటిగా కొనసాగుతా – పూజా బాలేకర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లడ్కి చిత్రం ఈ నెల 15న విడుదల కాబోతోంది. తెలుగులో అమ్మాయి అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో పూజ బాలేకర్ ప్రధాన పాత్రను పోషించింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. భారతదేశ మొదటి మార్షల్ ఆర్ట్స్ చిత్రంగా వర్మ ప్రమోట్ చేస్తున్నాడు.

ఈ సందర్భంగా మీడియాతో పూజ బాలేకర్ ముచ్చట్లు

వర్మ లాంటి దర్శకుడి సినిమాలో నటించడం ఎలా అనిపించింది?

నేను మొదటి నుండి సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. చిన్నతనం నుండే మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేశాను. అయితే వర్మ గారి నుండి ఫోన్ రాగానే మాత్రం ఎగ్జైటింగ్ గా అనిపించింది. ముంబైలో ఆయన ఆఫీస్ కు వెళ్లాను. ఆడిషన్ ఇచ్చాను. ఆయనకు నచ్చింది. వర్మ గారి లాంటి దర్శకుడి ద్వారా నా కెరీర్ స్టార్ట్ కావడం సరైన ఛాయస్ గా అనిపించింది.

మార్షల్ ఆర్ట్స్ మీద సినిమా కాబట్టి ఒప్పుకున్నారా లేక?

మార్షల్ ఆర్ట్స్ మీద సినిమా కాబట్టే వర్మ గారి దృష్టిలో నేను పడ్డాను. అది వచ్చు కాబట్టే నన్ను తీసుకున్నారు. లేకపోతే నాకంటే అందంగా ఉన్నవాళ్లు, హీరోయిన్ కి పెర్ఫెక్ట్ సెట్ అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సినిమా ద్వారా కొంత మంది అమ్మాయిలైనా మార్షల్ ఆర్ట్స్ పై అవగాహన నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.

మీ మొదటి సినిమానే ప్యాన్ వరల్డ్ అయ్యింది. ఎలా అనిపిస్తోంది?

నేనైతే ఇంత భారీ లెవెల్లో విడుదలవుతుందని ఊహించలేదు. వర్మ సర్ కూడా అనుకుని ఉండరు. షూటింగ్ కు ముందు ఎన్నో టెస్ట్ షూట్ లు చేసారు. అవి వివిధ ప్రొడక్షన్ కంపెనీలకు నచ్చడంతో ఇంత భారీ రిలీజ్ దక్కుతోంది.

అమ్మాయిలో మీ పాత్ర గురించి చెప్పండి.

ఇందులో నా పేరు పూజ కానిక్. నేను రావడానికంటే ముందే ఆ పాత్రకు ఆ పేరు పెట్టారు. ఇదంతా డెస్టినీ అనుకోవచ్చు. పూజకు బ్రూస్ లీ అంటే ఇష్టం. తన మీద ఇష్టంతోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ఆమె జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు ఆమెను మార్షల్ ఆర్ట్స్ వైపుకి ఎలా మళ్లించాయి, ఆమె తీసుకున్న నిర్ణయాలతో ఆమె జీవితం ఎలా మారింది అన్నది చిత్రంలో ప్రధానంగా ఉంటుంది.

ఈ సినిమాలో పూజ పాత్రకు మార్షల్ ఆర్ట్స్ ఎంత వరకూ సహాయపడింది?

యాక్షన్ సీక్వెన్స్ లు చేయడంలో చాలా కలిసివచ్చింది. నాకు బేసిక్ గా యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా వర్మ సర్ చక్కగా వివరించేవారు.

మీరు, వర్మ గారు కలిసి యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేశారట కదా?

వర్మ సర్ కి థియరీ పరంగా మార్షల్ ఆర్ట్స్ పై మంచి పట్టుంది. వర్మ గారి సలహాల వల్ల ఈజీగా కంపోజ్ చేయగలిగాను.

మార్షల్ ఆర్ట్స్ తో పాటు గ్లామర్ గా కూడా కనిపించారు?

ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ తో పాటు గ్లామర్ కూడా ఉండాలన్నారు. యాక్షన్, ఫిట్ నెస్, గ్లామర్ పరంగా నేను పెర్ఫెక్ట్ గా చూపించాలి అనుకున్నాను. నేను ఏదైనా చేయగలను. అందుకే రెండిటినీ బ్యాలెన్స్ చేశాను.

వర్మ గారి సినిమాలు ఏమైనా చూసారా?

నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్. ఆయన తీసిన రంగీలా, సత్య, సర్కార్ అన్నీ కూడా నా ఫెవరెట్ సినిమాలు.

దీని తర్వాత సినిమాల్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా?

మార్షల్ ఆర్ట్స్ లో నేను చాలా సాధించాను. నా టాలెంట్ తో ఇకపై సినిమాల్లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నా.

అంటే మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లోనే సినిమాలు చేస్తారా లేక?

నా పాత్ర స్ట్రాంగ్ గా ప్రత్యేకంగా అనిపిస్తే తప్పకుండా చేస్తా.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...