వైఎస్ విజయమ్మను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తొలగించి, ఆమెను పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఇది బహిరంగ రహస్యం. ఆ తప్పుని కప్పి పుచ్చుకునేందుకు, ప్లీనరీ వేదికగా విజయమ్మతోనే తాను తన కుమార్తె షర్మిలకు తెలంగాణలో అండగా వుండేందుకోసం, ఏపీకే పరిమితమైన వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పించారు వైసీపీ ‘పెద్ద’లు.!
సరే, ఆ విషయాన్ని కాస్సేపు పక్కన పెడదాం. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు గనుక, సిగ్గుపడాలనీ.. రాజకీయాల నుంచి పవన్ తప్పుకోవాలనీ సెలవిచ్చారు. బహుశా వైసీపీ రాజ్యాంగం ప్రకారం, ఓడిపోతే సిగ్గుపడాలనీ, రాజకీయాల నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారేమో.!
అందుకే, బహుశా వైసీపీ నుంచి విజయమ్మని సాగనంపినట్టున్నారు. అలాగైతే, వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసినవారిలో కొందరు ఓడిపోయారు కదా.? వాళ్ళ పరిస్థితేంటి.? 2014 ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నేతలు ఎంతమంది సిగ్గు పడి రాజకీయాల్ని వదిలేశారట.!
రాజకీయాలంటే గెలవడం, ఓడిపోవడం కాదు.. ప్రజా సేవ చేయడం. కానీ, వైసీపీ రాజ్యాంగం ప్రకారం గెలవడానికి అర్థం వేరే వుంది. కరెన్సీ నోట్లు పంచితే తప్ప, ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదనీ, అడ్డగోలు హామీలు ఇచ్చి, ఆ తర్వాత అవగాహనా రాహిత్యాన్ని చాటుకోవడమే రాజకీయమనీ వైసీపీ భావిస్తుండొచ్చు.
ఉద్యోగుల సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం.. వీటన్నిటిపైనా ఇచ్చిన హామీలేంటి.? అధికారంలోకి వచ్చాక మాట్లాడిందేంటి.? సిగ్గుపడాల్సింది ఇలాంటి విషయాల్లో కదా.? జనం ఓట్లెయ్యడం, వెయ్యకపోవడం అనేది ఈ రోజుల్లో ‘డబ్బు చుట్టూ నడుస్తున్న వ్యవహారం’గా మారిపోయింది. ఆ రాజకీయాన్ని మార్చాలనే జనసేనాని రాజకీయాల్లోకి వచ్చింది.
ఓట్లను కొనకుండా జనసేనాని రాజకీయాలు చేశారు. ఈ క్రమంలో కొంతమందినైనా తన భావజాలం వైపు జనసేనాని తిప్పుకోగలిగారు. అదీ గెలుపు అంటే.! డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసే పద్ధతి వైపుకి వైసీపీ, టీడీపీ జనాన్ని తీసుకెళ్ళాయి.. అదీ ఓటమి అంటే.!
పవన్ కళ్యాణ్‌ని తీవ్రంగా విమర్శిస్తే, పదవులు పదిలమవుతాయని బహుశా కాకాణి భ్రమల్లో వున్నారేమో. పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్ తదితరుల ప్రస్తుత పరిస్థితేంటి.? అదొక్కసారి రీచెక్ చేసుకోవడం కాకాణికే మంచిది.
912766 81179I discovered your weblog internet site on google and check a few of your early posts. Proceed to maintain up the exceptional operate. I just extra up your RSS feed to my MSN News Reader. In search of ahead to studying extra from you in a although! 515324
973003 909429Appreciate it for helping out, superb details. 668245
881104 383333Its superb as your other posts : D, regards for posting . 497180
17959 365172I used to be a lot more than pleased to seek out this internet-site.. I dont even know how I ended up here, but I thought this post was great. A good deal much more A rise in Agreeable. 917631
710872 725723I feel your suggestion would be useful for me. I will let you know if its function for me too. Thank you for sharing this beautiful articles. thanks a whole lot 328342
603720 408104Hello! I merely would wish to offer a huge thumbs up for that fantastic info youve here during this post. I is going to be returning to your website to get far more soon. 375759
568697 953858This is a good subject to speak about. Sometimes I fav stuff like this on Redit. I dont feel this would be the top to submit though. Ill take a appear about your internet site though and submit something else. 856657