క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ( Krishnavamsi) దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’ ( Rangamarthanda) నేడు ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా కృష్ణవంశీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ చేశారు
‘ నాలుగేళ్ల కష్టం మా ‘రంగమార్తాండ’. నూతన సంవత్సరం రోజున మీ ముందుకు తెస్తున్నాం. ఒక మంచి చిత్రాన్ని నిర్మించడానికి మంచి మనసుతో ముందుకు వచ్చి ఎంతో నమ్మకంగా నిలబడిన నిర్మాత ఎస్ వెంకట్ రెడ్డి, నా ఆత్మీయుడు మధుకి కృతజ్ఞతలు. మా రంగ మార్తాండలు ప్రకాష్ రాజ్( Prakash raj), బ్రహ్మానందం(Brahmanandam), మా అమ్మోరు( Ramyakrishna) అనసూయ(Anasuya), శివాత్మిక (Sivatmika) కు కృతజ్ఞతలు. మా దేవుడు ఇళయరాజా, మా గురూజీ సీతారామశాస్త్రి కి ధన్యవాదాలు. ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు” అని పోస్ట్ చేశారు.
‘మాటలు చాలడం లేదు’
మా గురువు కృష్ణవంశీ ( Krishnavamsi) కి ధన్యవాదాలు. మీ గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. మీ దర్శకత్వంలో పనిచేయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ‘రంగమార్తాండ ( Rangamarthanda)’ ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అంటూ శివాత్మిక రాజశేఖర్( Sivatmika Rajasekhar) పోస్ట్ చేశారు.
ఉగాది కానుకగా విడుదలైన ‘రంగమార్తాండ’ సూపర్ హిట్ టాక్ ని అందుకుంటోంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇళయరాజా( Ilayaraja) సంగీతం అందించారు. రంగస్థలం నటుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’ కు ఇది రీమేక్.