కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వరంగల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్బంగా కొండా మురళి మాట్లాడుతూ ”తెలంగాణలో ఇంత కష్టపడిన మనిషి ఉంటాడా? అని నా జీవితాన్ని సినిమాగా తీస్తానని వర్మ చెప్పారు. నా జీవితంలో ఆర్జీవీని మర్చిపోను. నా పాత్రలో త్రిగుణ్ బాగా నటించారు” అని అన్నారు.
కొండా సురేఖ మాట్లాడుతూ ”30 సంవత్సరాల మా జీవిత చరిత్రను రెండున్నర గంటల్లో ఎంతో ఇష్టంతో తీసినందుకు వర్మకి ఏం ఇచ్చుకున్నా మా రుణం తీర్చుకోలేం. కొండా మురళి నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ రోజు నేను ఇలా ప్రజల ముందు నిలబడ్డాను. ఇక, ‘కొండా’లో మురళి గారి పాత్ర పోషించిన త్రిగుణ్ నా కొడుకు లాంటోడు. మురళి గారి పాత్రలో బాగా చేశాడు. నా పాత్రలో ఇర్రా మోర్ కూడా బాగా నటించింది. ఇక్కడికి వచ్చిన వర్మ గారి కుటుంబ సభ్యులకు థాంక్స్. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ”కొండా మురళి, సురేఖ జీవించిన జీవితాన్ని రెండు గంటల్లో నాకు వీలైనంత బాగా సినిమా తీయడానికి ప్రయత్నించా. నేను ఆశించిన దానికంటే త్రిగుణ్ ఎక్కువ చేశాడు. ఇర్రా మోర్ అద్భుతంగా నటించింది. సుచిత్ర ‘తెలంగాణ పోరి’ పాటకు కొరియోగ్రఫీ చేశారు. గద్దర్ పాటలు కొన్ని తీసుకున్నాం. డి.ఎస్.ఆర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు” అని చెప్పారు.
త్రిగుణ్ మాట్లాడుతూ ”కొండా అనేది పేరు కాదు, ఒక ఎమోషన్. వరంగల్లో కొండా అనేది ఎమోషన్. సినిమాలో ఆ ఎమోషన్ చూపించే అవకాశం నాకు దక్కింది. ఇన్నేళ్ళూ ఇండస్ట్రీలో నాకు నచ్చిన సినిమాలు నేను చేశా. ఇర్రా మోర్ మాట్లాడుతూ ”సురేఖమ్మ ఫైర్ బ్రాండ్. ఆమె పాత్రలో నటించే అవకాశం నాకు వచ్చిన వర్మకు థాంక్స్” అని చెప్పారు. కొండా సుష్మితా పటేల్ మాట్లాడుతూ.. మన కథ మనం చెప్పే రోజులు వచ్చాయి. 35 ఏళ్ళ క్రితం కొండా మురళి, కొండా సురేఖ ఎలా ఉండేవారు? ఉద్యమ ప్రయాణం ఏంటి? కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ ఎదగడానికి కారణం ఏంటి? అంటే అణచివేత. ఆ అణచివేత ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో కనిపిస్తుంది.
351246 621568Im so pleased to read this. This really is the type of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this greatest doc. 813030
818615 415797The leading source for trustworthy and timely health and medical news and info. 44693
49910 658010I visited plenty of website but I believe this one contains something extra in it in it 942569
344008 579868The the next occasion Someone said a weblog, Hopefully so it doesnt disappoint me approximately this. What im saying is, I know it was my choice to read, but I in fact thought youd have something interesting to express. All I hear is often several whining about something that you could fix should you werent too busy searching for attention. 656497
363095 401606Where else could anybody get that type of info in such a perfect method of writing? 464994