Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 19 జూన్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం

సూర్యోదయం: ఉ.5:31
సూర్యాస్తమయం: సా.6:36
తిథి: జ్యేష్ఠ శుద్ధ పంచమి ఉ.5:59 వరకు తదుపరి జ్యేష్ఠ శుద్ధ షష్టి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: ధనిష్ట ఉ.11:46 వరకు తదుపరి శతభిషం
యోగం: విష్కంభ సా.4:52 వరకు తదుపరి ప్రీతి
కరణం: గరజి సా.4:56 వరకు తదుపరి వనిజ
వర్జ్యం: సా.6:40 నుండి రా.8:11 వరకు
దుర్ముహూర్తం: సా.4:25 నుండి 5:13 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:33 నుండి సా.5:10 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:10 నుండి 4:58 వరకు
అమృతఘడియలు: తె.4:37 నుండి సూర్యోదయం వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ. 11:51 నుండి మ.12:53 వరకు

ఈ రోజు (19-06-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

వృషభం: కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది.

మిథునం: రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆశించిన సహాయం లభించదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కర్కాటకం: ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

సింహం: ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు.

కన్య: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

తుల: ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది.

ధనస్సు: జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్య విషయాలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు.

మకరం: ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి.

కుంభం: దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.

మీనం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...