Switch to English

కొడాలి పురాణం: బొచ్చు పీకుడు.. సొల్లు వాగుడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలేంటి.? వాటి పరిష్కారం మాటేమిటి.? కరోనా వైరస్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.? కరోనాతో భయాందోళనలకు గురవుతున్న ప్రజలకు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన భరోసా ఏంటి.? ఇవన్నీ పక్కన పెట్టేసి, ఎక్కడో హైద్రాబాద్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు మీద బూతుల పంచాంగం అందుకున్నారు మంత్రి కొడాలి నాని.

రాష్ట్రంలో బూతుల మంత్రిగా ఇప్పటికే కొడాలి నాని పేరు పాపులర్‌ అయిపోయింది. ఆ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానాన్నీ, చంద్రబాబునీ ఉద్దేశించి.. కొడాలి నాని చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం విదితమే. సన్నబియ్యం విషయంలోనూ కొడాలి నాని అదే భాష వాడారు. ‘ఆయన తీరే అంత..’ అని సరిపెట్టుకోవడానికి ఆయనేమీ సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు. రాష్ట్రానికి మంత్రి.

తాజాగా మీడియా ముందుకొచ్చిన కొడాలి నాని, ‘ఈ ప్రెస్‌ మీట్‌ చంద్రబాబుని విమర్శించడానికి కాదు..’ అంటూనే, ‘బొచ్చు పీకుడు.. సొల్లు వాగుడు’ అనే ఆణిముత్యాల్ని చంద్రబాబు మీద వదిలారు కొడాలి నాని. ఎల్లో మీడియా.. అంటూ ఆ రెండు మీడియా సంస్థల గురించీ కొడాలి నాని మరికొన్ని ఆణి ముత్యాలు పేల్చారు సరే, వైసీపీ అధికారిక మీడియా కూడా చేసేది అదే పని కదా.! అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్‌, రేషన్‌ని ప్రజలకు అందిస్తున్నందుకు అభినందించాల్సిందే.

కానీ, లాక్‌ డౌన్‌ నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలన్న కనీస విజ్ఞత చాలా చోట్ల కొరవడింది. దానిపై మీడియాలో కథనాలొస్తున్నాయి. రేషన్‌ కోసం ఎండలో నిలబడి ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందన్న వార్త కూడా బయటకొచ్చింది. రేషన్‌ కోసం జనం క్యూ లైన్లలో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ‘అబ్బే, ఇబ్బందులేమీ లేవు..’ అని ప్రభుత్వం చెప్పదలచుకుంటే అంతకన్నా బాధ్యతారాహిత్యం ఇంకోటుండదు.

గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ రేషన్‌ అందించేయగలిగితే.. ఈ సమస్య వచ్చేదే కాదు. అదే విపక్షాలు చెబుతున్నది. కానీ, ప్రభుత్వం తరఫున.. సంబంధిత మంత్రి ‘బూతుల పురాణం’ విపక్షాలపై అందుకోవడం ఎంతవరకు సబబు.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....