Switch to English

బీజేపీ.. ఇండియన్‌ కరోనా అంటున్న ఏపీ మంత్రి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,461FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీని ఇండియన్‌ కరోనాగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మంత్రి కొడాలి నాని. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో.. ఆ మాటకొస్తే బూతులతో విరుచుకుపడే కొడాలి నాని, అలా తాను ఆ బూతులు మాట్లాడటాన్ని సమర్థించుకున్నారు. ‘చాలామంది ఇంట్లో మాట్లాడుకునే భాషే అది.. నేను మీడియా ముందు కూడా మాట్లాడతాను..’ అని అన్నారాయన.

‘మీ ఇంట్లో మీ పిల్లలు ఎప్పుడన్నా ఆ బూతులు మాట్లాడొద్దని చెప్పారా.?’ అనడిగితే, తన తీరుని ఆయన నిర్మొహమాటంగా సమర్థించుకోవడం గమనార్హం. ఇక, బీజేపీని కరోనాతో పోల్చిన కొడాలి నాని, ఆ బీజేపీ కరోనా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కి సోకినా, ఎలాంటి లక్షణాలూ వుండవని వ్యాఖ్యానించడం గమనార్హం.

‘ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి బీజేపీ కరోనా గతంలోనే సోకింది.. అందుకే పార్టీ పూర్తిగా రాష్ట్రంలో నాశనమైపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ బీజేపీ కరోనా పట్ల అప్రమత్తంగా వుండాలి..’ అంటూ కొడాలి నాని, బీజేపీపై చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.

ఢిల్లీ స్థాయిలో బీజేపీతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని వైసీపీ నేతలు కొందరు చెబుతున్న నేపథ్యంలో కొడాలి నాని, బీజేపీ విషయంలో ఇంత తీవ్రంగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ ‘ఎక్స్‌పైర్‌’ అయిపోయిందనీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చినా.. ఇంకెవరు వచ్చినా ఆ పార్టీని బాగు చేయడం సాధ్యపడదని తేల్చి చెప్పేశారు కొడాలి నాని.

మూడు రాజధానుల విషయం గురించి మాట్లాడిన కొడాలి నాని, హైకోర్టు వెళ్ళిపోతే కర్నూలుకి ఏమీ లాభం వుండదని టీడీపీ నేతలు చెబుతున్న దరిమిలా, అది వెళ్ళిపోవడం వల్ల అమరావతికి నష్టమేంటని ప్రశ్నించారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విశాఖకు వెళితే, విశాఖకు అదనపు లాభం వుండదని చెబుతున్నప్పుడు, అమరావతికి నష్టమెలా వుంటుందని అన్నారాయన.

స్వర్గీయ ఎన్టీఆర్‌, చంద్రబాబుని తిట్టారనీ.. తాను తిట్టడంలో తప్పేముందని చెప్పుకొచ్చిన కొడాలి నాని.. ఇంటర్వ్యూ అంతటా చంద్రబాబుపై చిత్ర విచిత్రమైన తిట్లతో విరుచుకుపడ్డారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...