Switch to English

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: బ్లాక్‌మెయిలింగ్‌కి ‘ప్రూఫ్‌’ కావాలా.? – 4

కొన్ని వెబ్‌సైట్ల నుంచి దూసుకొస్తున్న ఫేక్‌ న్యూస్‌లనూ, బ్లాక్‌మెయిలింగ్‌ వ్యవహారాల్నీ తెలుగు సినీ పరిశ్రమ సీరియస్‌గా తీసుకున్నాక, ఓ ప్రముఖ వెబ్‌సైట్‌.. తన మీద వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. అయితే, అందులో ‘వివరణ’ కంటే, సినీ పరిశ్రమ తప్పొప్పుల్ని ఎంచి చూసే ప్రయత్నమే ఎక్కువగా కన్పించింది.

‘దమ్ముంటే ఆధారాలు చూపించండి..’ అన్నట్లుగా అందులో కొన్ని అంశాలు కన్పించాయి. దాంతో, ‘ఇవిగో ఆధారాలు’ అంటూ కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా సదరు వెబ్‌సైట్‌ గతంలో రాసిన ‘చెత్త గాసిప్స్‌’ని చూపిస్తున్నారు. అంతే కాదు, ఆయా ‘ఫేక్‌ న్యూస్‌’ల కారణంగా, సదరు వెబ్‌సైట్‌ ఎదుర్కొన్న కేసుల వివరాల్నీ ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు.

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: ‘ముసలోడు’.. వసూళ్ళలో మామూలోడు కాదు.! – 1

ఓ ప్రముఖ నటుడి సినిమా రేటింగ్‌ విషయంలో బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడినట్లు సదరు వెబ్‌సైట్‌పై నమోదైన కేసుని పేర్కొంటూ, ఆ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోతే ఇన్నేళ్ళపాటు ఆ కేసు ఎలా నడుస్తోందన్నది వారి ప్రశ్న. బ్లాక్‌మెయిలింగ్‌ చర్యల్లో భాగంగా తమనుంచి పెద్ద మొత్తంలోనే డిమాండ్‌ చేశారనీ, ఆ పప్పులుడక్కపోవడంతో నెగెటివ్‌ ప్రచారానికి దిగారన్నది సదరు ప్రముఖుడు ఆ వెబ్‌సైట్‌పై కేసు పెట్టాడు అప్పట్లో.

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: బెగ్గింగ్‌ నుంచి బ్లాక్‌మెయిలింగ్‌ దాకా! -2

‘వెబ్‌ బ్లాక్‌మెయిల్‌’ చర్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే క్రమంలో, అందుకు తగ్గ ఆధారాల్ని పక్కాగా సేకరించారట. వాయిస్‌ రికార్డింగ్స్‌ వంటివి ఆధారాలుగా చూపి, అడ్డంగా బుక్‌ చేశారట. అందుకే ఆ కేసు అంత స్ట్రాంగ్‌గా ఎక్కువ కాలం నిలబడిందని అంటారు. ఇదివరకటిలా బుకాయిస్తే సరిపోదిప్పుడు. ఎందుకంటే, ఆధారాలతో సహా నెటిజన్లు, సినీ జనాలు ‘సోకాల్డ్‌ ఫేక్‌గాళ్ళ’ జాతకాల్ని బయటపెడ్తున్న పరిస్థితి కన్పిస్తోంది.

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: ఇదేం పైత్యం ‘వసూల్‌ రాజా’.? -3

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

చంద్రబాబు: స్వపక్షాన్నీ కొనక తప్పదా?

ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీని తట్టుకుని మరో నాలుగేళ్లు ఎలా పోరాడాలా అని...

టిక్‌టాక్‌ వ్యామోహంతో ఆత్మహత్య

ఇండియాలో టిక్‌టాక్‌కు కోట్లాది మంది బానిసలుగా మారిపోతున్నారు. చిన్న పిల్లలు పెద్ద వారు ఇలా ప్రతి ఒక్కరు కూడా టిక్‌టాక్‌ మోజులో పడి తమ పని వదిలి పెట్టి జీవితాలను కూడా నాశనం...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కరోనాకి అన్ లాక్.. కేసులు పైపైకి..!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కాలంలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. జాన్ బీ.. జహాన్ బీ అనే నినాదంతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు లాక్ డౌన్...

బాలయ్య – ఎన్టీఆర్ కాంబో మూవీ.. సాధ్యమయ్యేనా?

నందమూరి బాలకృష్ణ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ అది ఇప్పటివరకూ సాధ్యమవ్వలేదు. బాలయ్య హీరోగా నటించిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో...