Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: రాష్ట్రంలో కమ్మ, రెడ్డి కులాలు మాత్రమే వున్నాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

దేశంలో ఎక్కడా లేని ‘కుల జాడ్యం’ ఆంధ్రప్రదేశ్‌లోనే కన్పిస్తుంది. 2009 నుంచి 2014 వరకూ రాష్ట్రంలో ‘కమ్మ’ పాలన సాగిందంటూ అప్పట్లో వైఎస్సార్సీపీ విమర్శించింది. ఇప్పుడేమో, రాష్ట్రంలో ‘రెడ్డి’ పాలన కొనసాగుతోందని టీడీపీ విమర్శిస్తోంది. అటు వైసీపీ చెప్పిందీ నిజమే.. ఇటు టీడీపీ చెప్పిందీ నిజమేనేమో.!

చంద్రబాబు హయాంలో ‘కమ్మ’ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లోనూ పెద్ద పీట వేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? కాంట్రాక్టుల దగ్గర్నుంచి.. ఉద్యోగాలదాకా.. ‘కమ్మ’టి ‘కోటా’ అమలయ్యిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇప్పుడు అదే విధానం వైసీపీ పాలనలోనూ అమలవుతోందట.. అయితే, చిన్న తేడా ఏంటంటే.. ఇప్పుడు ‘రెడ్డి’ కోటా కింద ఆయా పదవుల్ని భర్తీ చేస్తున్నారంతే.

ప్రభుత్వ ఖజనా నుంచి వేతనాల్ని అందుకుంటోన్న ‘సలహాదారుల’ లెక్క తీస్తే, అందులో ‘రెడ్డి’ సామాజిక వర్గానికి ఏ స్థాయిలో పెద్ద పీట వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తమ ‘కోటా’ తగ్గుతోందని ‘కమ్మ’ సామాజిక వర్గం గుస్సా అవుతోంది. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు కుమార్తె, అమరావతి మహిళా జేఏసీ నేత రాయపాటి  శైలజ, తాజా పరిణామాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గానికి పెద్దగా అవకాశాలు దక్కలేదు’ అని చెబుతున్నారామె. ‘అందరూ కమ్మోళ్ళనే తీసుకుంటున్నారనే విమర్శలు వస్తాయని.. అప్పట్లో చంద్రబాబు కమ్మ కులానికి తగిన ప్రాధాన్యతనివ్వలేదు. ఇప్పుడేమో, కమ్మ సామాజిక వర్గంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సిగ్గూ శరం వుంటే వైసీపీలోని కమ్మ ప్రజా ప్రతినిథులు పార్టీ నుంచి బయటకు రావాలి..’ అంటూ సంచలన ఆరోపణలు చేశారామె.

అంతే కాదు, ‘కమ్మ సామాజిక వర్గం అంతా ఒక్క తాటిపైకి రావాలి..’ అని అల్టిమేటం కూడా జారీ చేసేశారు శైలజ. ఇదెక్కడి పైత్యం.? అటు కమ్మ సామాజిక వర్గం.. ఇటు రెడ్డి సామాజిక వర్గం.. రాష్ట్రంలో ఈ రెండే వున్నాయా.? మిగతా కులాల సంగతేంటి.? మతాల మాటేమిటి.? కుల మతాలకతీతంగా పరిపాలన చేస్తామని వైఎస్‌ జగన్‌ చెబుతూ వస్తున్నారు. కానీ, చేస్తున్నదేంటి.? రెడ్డి సామాజిక వర్గానికే ఎందుకు ‘అగ్ర తాంబూలం’ దక్కుతోంది.? అన్న ప్రశ్నకు స్వయానా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

పార్టీలో ఆయన ఎవరికైనా అవకాశాలిచ్చుకోవచ్చు. కానీ, ప్రభుత్వంగా.. ప్రజలందర్నీ ఒకేలా చూడాలి కదా.! సంక్షేమ పథకాల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు ఓ పక్క చెయ్యడం.. ఇంకోపక్క, తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం.. అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. కమ్మ – రెడ్డి వివాదంతో అయినా, రాష్ట్ర ప్రజానీకం కళ్ళు తెరవాలన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...