కరోనా కారణంగా జీవితాలు అస్థవ్యస్థం అయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో చాలా మంది కుటుంబ పోషణ భారం అవ్వడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ గత ఆరు నెలల నుండి మూత బడి ఉండటంతో అందులో పని చేసే టీచర్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో నలిగి పోతున్నారు.
ఇన్నాళ్లు టీచర్ వృత్తిలో ఉన్న వారు ఇప్పుడు కూలినాలి చేసుకుంటున్నారు. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో షెల్టర్ ఏర్పాటు చేసుకుని చెప్పులు అమ్ముకుంటున్న ప్రైవేట్ టీచర్ వెంకటేశ్వరావు విషయం వైరల్ అయ్యింది.
ఆ విషయం ఆ నోట ఈనోట పడి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వరకు వెళ్లింది. విషయం తెలిసి అక్కడకు వెళ్లిన కలెక్టర్ సొంత వ్యాపారంకు సాయం చేయడం లేదంటే ఏదైనా ఔట్ సోర్సింగ్ ఉద్యోగంను ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చాడు. నేడు కలెక్టర్ క్యాంపు ఆఫీస్ కు రావాల్సిందిగా వెంకటేశ్వరావుకు కలెక్టర్ సూచించారు.
రోజు ఎండలో చెప్పులు అమ్మకుంటూ జీవనం సాగిస్తున్న టీజర్ పరిస్థితికి చలించి పోయిన కలెక్టర్ సాయంకు ముందుకు రావడం అభినందనీయం. 15 ఏళ్లుగా ఒక ప్రైవేట్ స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ గా పని చేస్తున్న వెంకటేశ్వరరావుకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నారు. వారి పోషణ మరియు చదువుల కోసం వెంకటేశ్వరరావు ఈ పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
112426 252186It is truly an excellent and valuable piece of information. Im pleased which you just shared this valuable information with us. Please stay us informed like this. Thank you for sharing. 139731
474766 935886Definitely,Chilly spot! We stumbled on the cover and Im your own representative. limewire limewire 476787