Devil: నందమూరి కళ్యాణ్ రామ్( Kalyan Ram) మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి ‘డెవిల్( Devil)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. ఈ మేరకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఇందులో కళ్యాణ్ రామ్.. బ్రిటిష్ రహస్య ఏజెంట్ గా కనిపించనున్నారు.
తాజాగా విడుదల చేసిన స్టిల్ లో ఆయన సీరియస్ లుక్ లో కనిపించారు. ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మేనన్ ( Samyukta Menon)..కళ్యాణ్ రామ్(Kalyan Ram) కి జోడీ గా నటిస్తోంది.
కళ్యాణ్ రామ్ ఇటీవలే ‘అమిగోస్’ తో అలరించారు. ఇందులో అయన త్రిపాత్రాభినయం చేశారు. ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది.