Animal: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన యానిమల్ (Animal) 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు (Kiran Rao) స్పందిస్తూ.. ‘యానిమల్ స్త్రీ విద్వేషంతో ఉంది. బాహుబలి-2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీలపై ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయి. బాహుబలి ప్రారంభంలో స్త్రీ పాత్రలను బలంగా చూపించినా చివరకు సాధారణ పాత్రల్లానే మలిచారు. ఇటువంటి సినిమాలతో సమాజానికి కీడు ఎక్కవ’అని అన్నారు.
దీనిపై సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ.. ‘నా సినిమాలను విమర్శించే ముందు ఆమె అమీర్ ఖాన్ దిల్ సినిమా చూడాలి. ఇందులో హీరో దాదాపు అమ్మాయిపై హత్యాచారం చేసి.. తర్వాత అమ్మాయిదే తప్పన్నట్టు చూపిస్తాడు. కానీ అదే అమ్మాయి చివరకు అతడితో ప్రేమలో పడుతుంది. మరి ఇదేంటి. ముందు ఇలాంటి సినిమాలు గురించి మాట్లాడి తర్వాత ఇతర సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. గతాన్ని మరచి విమర్శలు మంచిది కాద’ని అన్నాడు.