Switch to English

జనసేనాని ఇంటర్వ్యూ.. జగన్‌ సర్కార్‌పై ప్రశంసలు, ప్రశ్నాస్త్రాలూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో కన్పించారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన తనదైన శౖలిలో స్పందించారు. ఘాటైన విమర్శలకు దూరంగా.. అత్యంత బాధ్యతాయుతంగా పలు అంశాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టారు. చాతుర్మాస దీక్ష గురించీ, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించీ, రాజధాని అమరావతి గురించీ, రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న ఇళ్ళ వ్యవహారం గురించీ పవన్‌ కళ్యాణ్‌ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయనేం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

ప్రజా జీవితంలో వున్నాను కాబట్టే.. చాతుర్మాస దీక్ష గురించి అందరికీ తెలిసింది..

ఎన్నో ఏళ్ళుగా చాతుర్మాస దీక్ష చేస్తున్నాను. అయితే, ఇప్పుడు ప్రజా జీవితంలో వున్నాను గనుక, దాని గురించి అందరికీ తెలుస్తోంది. సాత్విక ఆహారం తీసుకోవడం.. నేలపైనే పడుకోవడం.. చాతుర్మాస దీక్షలో ముఖ్యమైన విషయాలు.

కట్టేసి వున్న ఇళ్ళు ఇవ్వడంలో ప్రభుత్వానికి ఏంటి అభ్యంతరం.?

కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు పది లక్షల ఇళ్ళ నిర్మాణానికి సహకరించింది. మరో మూడు లక్షల ఇళ్ళు నిర్మాణం కావాల్సి వుంది. భూమి లభ్యత తగ్గినప్పుడు వున్న స్థలంలోనే నిటారుగా ఫ్లాట్లు నిర్మించి, వాటిటిని పేదలకు కేటాయించాల్సి వుంది. చాలా జిల్లాల్లో పలు అంశాలపై తిరిగినప్పుడు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆయా ఇళ్ళ నిర్మాణాలు చూపించి, వాటిని కేటాయించలేదంటూ నా వద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమిని సేకరించడం కష్టసాధ్యమైన పని. కొందరి దగ్గర భూమిని లాక్కుని, ఇంకొకరికి పంచాలనుకోవడం సబబుకాదు. ఈ క్రమంలో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టేసి వున్న ఫ్లాట్లను పేదలకు ఇవ్వడంలో ప్రభుత్వం బేషజాలకు పోవడం అస్సలేమాత్రం మంచిది కాదు.

అమరావతికి అప్పుడు ఒప్పుకుని, ఇప్పుడు మాట మార్చేస్తే ఎలా.?

‘మేం ఒక రాజధానికి వ్యతిరేకం, మూడు రాజధానులకు అనుకూలం’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గతంలోనే చెప్పి వుంటే, ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నించడానికి వీల్లేదేమో. కానీ, అమరావతి విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ ఒప్పుకున్నాయి. ఈ క్రమంలోనే రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చింది. రెండు మూడు వేల ఎకరాల భూములు సరిపోయే రాజధాని కోసం, 30 వేల ఎకరాలు సేకరించడం కూడా సబబు కాదు. సింగపూర్‌ మోడల్‌ అని చెప్పి అమరావతిని చంద్రబాబు ప్రభుత్వం అమ్మేస్తే, ఇప్పుడు మూడు రాజధానులంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమ్మేస్తోంది.! అంతిమంగా నష్టపోతున్నది రైతులు మాత్రమే.

దళితులపై దాడులు అమానుషం

రాష్ట్రంలో ఓ దళిత మహిళ హోంమంత్రిగా వున్నారు. కానీ, దళితులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయి. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రభుత్వం, మిగతా కేసుల్లో ఎందుకు అంత వేగంగా స్పందించడంలేదు.? ఇది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వం తక్షణం నిందితులపై కరిÄన చర్యలు తీసుకోవాలి. వరుసగా దళితులపై జరుగుతున్న దాడులు నన్ను కలచివేస్తున్నాయి.

కరోనా టెస్టులు ఎక్కువ చేయడం అభినందనీయమేగానీ..

కరోనా వైరస్‌ టెస్టులు ఎక్కువగా చేస్తున్నందున ప్రభుత్వాన్ని అభినందించాం. మనస్పూÛర్తిగా చేసిన అభినందన అది. అయితే, ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక బాధితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తి విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం. ప్రపంచానికే ఈ పరిస్థితి చాలా కొత్తది. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రం ఇంకాస్త బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, ప్రజలకు మేలు జరుగుతుంది. లాక్ డౌన్ సమయాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టి వుండాల్సింది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కేసులు అనూహ్యంగా పెరిగిపోవడం బాధాకరం.

ఇలా సాగింది జనసేనాని ఇంటర్వ్యూ.. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేయకుండానే, కీలకమైన అంశాల పట్ల తన అభిప్రాయాల్ని, జనసేన పార్టీ విధానాన్ని కుండబద్దలుగొట్టేస్తూ, ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...