Switch to English

భీమవరం నుంచే జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

కన్‌ఫ్యూజన్ కాస్త తొలగింది. అసెంబ్లీకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. అదీ, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే జనసేనాని పోటీ చేస్తారట.! ఈ విషయాన్ని తాజాగా జనసేన పార్టీలో చేరిన పులవర్తి ఆంజనేయులు ప్రకటించారు.

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని హైద్రాబాద్‌లో కలిసిన పులవర్తి ఆంజనేయులు, తాను భీమవరం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మీరే పోటీ చేయండి..’ అని పవన్ కళ్యాణ్ తనకు సూచించారంటూ పులవర్తి ఆంజనేయులు చేసిన ప్రకటనతో జనసేన శ్రేణులు షాక్‌కి గురయ్యాయి.

‘పవన్ కళ్యాణ్‌నే పోటీ చేయమని అడిగాను. నా సంపూర్ణ సహాయ సహకారాలు మీకే వుంటాయని పవన్ కళ్యాణ్‌గారితో చెప్పాను. ఆయన నన్ను పోటీ చేయమన్నారు. నాకు అవకాశం కల్పించినా, ఆయన పోటీ చేసినా.. ఫర్లేదు.. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాను..’ అని పులవర్తి ఆంజనేయులు గతంలోనే ప్రకటించారు.

కొద్ది రోజుల క్రితం భీమవరం వెళ్ళిన పవన్ కళ్యాణ్, ఆ పర్యటనలో స్థానిక టీడీపీ, బీజేపీ నేతలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, భీమవరం నుంచి పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో స్పష్టత ఇవ్వలేదు. అయితే, తాజాగా జనసేనాని కాస్త స్పష్టత ఇచ్చారు.

‘భీమవరం వదిలేది లేదు..’ అంటూ పులవర్తి ఆంజనేయులు జనసేనలో చేరిన సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. భీమవరంలో జనసేన గెలిచాక, స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జనసేనాని వ్యాఖ్యానించారు. ‘భీమవరం నాది.. వదిలే ప్రసక్తే లేదు..’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

జనసేన పార్టీ, పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లలో పోటీ చేస్తుందని తొలుత ప్రకటన వచ్చినా, తాజాగా 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్ సభ సీట్లకు పరిమితమైంది. ఇప్పటివరకు కేవలం ఆరుగురు అసెంబ్లీ అభ్యర్థుల్నే జనసేన పార్టీ ఖరారు చేసింది.

వీలైనంత త్వరగా జనసేనాని పోటీ చేసే నియోజకవర్గంపై అధికారిక ప్రకటన వస్తే బావుంటుందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. స్వయంగా పవన్ కళ్యాణ్, ‘భీమవరం నాది’ అని ప్రకటించిన దరిమిలా, ఈ సస్పెన్స్‌కి ఇక్కడితో తెరపడినట్లే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...