Switch to English

Janasena: లేటెస్ట్ ఈక్వేషన్: జనసేన ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఇవీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

2024 సార్వత్రిక ఎన్నికలు జనసేన పార్టీకి అత్యంత కీలకం. అధికార వైసీపీకి అయినా, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి అయినా ఈ ఎన్నికలు చావో రేవో.. అన్న టైపు.! వైసీపీ వైనాట్ 175 అంటోందిగానీ, ఆ పార్టీ నుంచి ప్రజా ప్రతినిథులే ‘మేం వుండలేం మొర్రో..’ అంటూ ఇతర పార్టీల్లోకి పారిపోతున్నారు.

ఇక, తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే, 2019 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూశాక పూర్తి నిస్తేజంలోకి వెళ్ళిపోయిన క్యాడర్ ఇప్పుడిప్పుడే, కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటోంది. జనసేనతో జతకట్టిన టీడీపీ, ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న అంచనాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకి లాభమేంటి.? జనసేనతో జత కట్టడం వల్ల టీడీపికి లాభమేంటి.? ఈ విషయమై చాలా రకాల విశ్లేషణలు చూశాం, చూస్తూనే వున్నాం. జనసేన పార్టీకి గౌరవ ప్రదమైన సీట్లు పొత్తులో భాగంగా కేటాయిస్తేనే, కింది స్థాయిలో ఓటు ట్రాన్స్‌ఫర్ ఇరు పార్టీల మధ్యా సజావుగా సాగుతుందన్నది బహిరంగ రహస్యం.

అయితే, ఆ గౌరవ ప్రదమైన సీట్లు ఎన్ని.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ దాదాపు 72 సీట్లలో పోటీ చేసే అవకాశం వుందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం తాలూకు సారాంశం. ఇదే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది కూడా.

కాగా, జనసేనకు పాతిక ముప్ఫయ్ సీట్ల కంటే ఎక్కువ అనవసరం.. అంటూ, టీడీపీ అను‘కుల’ మీడియా చేస్తున్న ప్రచారం, టీడీపీ – జనసేన మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్‌కి ఇబ్బందికరంగా మారేలా వుంది.

ఇదిలా వుంటే, ఇప్పటికిప్పుడు జనసేన గెలిచే సీట్లు ఎన్ని.? అన్నదానిపై ఆసక్తికరమైన ఫిగర్ ఒకటి బయటకు వస్తోంది. ఆ ఫిగర్ ప్రకారం చూస్తే, 42 సీట్లలో జనసేన పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించబోతోందిట. అది ఇప్పటికిప్పుడున్న పరిస్థితి. ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ఈక్వేషన్స్ ముందు ముందు చాలా మారబోతున్నాయి. మారే ప్రతి ఈక్వేషన్ జనసేనకు పాజిటివ్ ఓటింగ్‌గా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ చాలా బలంగా వుందన్నది అందరికీ తెలిసిన విషయం విదితమే. తమకంటే కూడా జనసేన పార్టీ ఈ జిల్లాల్లో బలంగా వుందని టీడీపీ కూడా నమ్ముతోంది. ఆ లెక్కన టీడీపీ కంటే కనీసం ఒక్క సీటు అయినా జనసేన ఎక్కువగా పొంది ఈ జిల్లాల్లో పోటీ చేస్తే, టీడీపీ – జనసేన కూటమికి పాజిటివ్ ఓటింగ్ వుంటుంది.

కింది స్థాయిలో వున్న పరిస్థితుల్ని విశ్లేషిస్తే,

కాకినాడ పరిధిలో

  • పిఠాపురం
  • కాకినాడ రూరల్
  • కాకినాడ సిటీ
  • పెద్దాపురం లేదా జగ్గంపేట నియోజకవర్గాలూ,

అమలాపురం పరిధిలో

  • రాజోలు
  • అమలాపురం
  • కొత్తపేట
  • పి.గన్నవరం లేదా ముమ్మిడివరం,

నరసాపురం పరిధిలో

  • భీమవరం
  • నరసాపురం
  • తాడేపల్లి గూడెం
  • తణుకు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.

రాజమండ్రి పరిధి లో

  • రాజమండ్రి రూరల్
  • రాజానగరం
  • కొవ్వూరు లేదా నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన చాలా బలంగా వుంది.

ఈ నియోజకవర్గాల్లో జనసేన విజయం నల్లేరు మీద నడకే.! అలా చూస్తే, ఉమ్మడి తూర్పు గోదావరి లో జనసేన:TDP 10:9 అవుతుంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే, జనసేనకు 7 సీట్లు కేటాయిస్తే, టీడీపీ – జనసేన కూటమికి విజయావకాశాలు అనూహ్యంగా పెరుగుతాయి.

  • నరసాపురం
  • భీమపరం
  • తాడేపల్లి గూడెం
  • తణుకు
  • కొవ్వూరు
  • ఏలూరు
  • ఉంగుటూరు నియోజకవర్గాల్లో జనసేనకు విజయావకాశాలు స్పష్టంగా వున్నాయి.

ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ జనసేన పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. స్థానికంగా వున్న పరిస్థితుల్ని బట్టి, 6 సీట్లలో జనసేన విజయ ఢంకా మోగించేందుకు వీలుంది. ఆ నియోజకవర్గాలు..

  • గాజువాక
  • విశాఖ సౌత్
  • పెందుర్తి
  • అనకాపల్లి
  • భీమిలి
  • ఎలమంచిలి

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సహా అనేక అంశాలు ఈ జిల్లాలో జనసేన పార్టీకి అనూహ్యమైన మైలేజ్ తెచ్చిపెట్టాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికొస్తే, మొత్తం ఐదు సీట్లలో జనసేన గెలిచే అవకాశం వుంది. వాటిల్లో..

  • విజయవాడ వెస్ట్
  • కైకలూరు
  • పెడన
  • మచిలీపట్నం
  • అవనిగడ్డ నియోజకవర్గాలున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేనకు సానుకూలంగా వుంది.

విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల జనసేన ఖాతాలో పడే అవకాశం వుంది.

గుంటూరు జిల్లా విషయానికొస్తే,

  • తెనాలి
  • గుంటూరు ఈస్ట్
  • సత్తెనపల్లి నియోజకవర్గాలు జనసేన ఖాతాలో పడతాయి.

ప్రకాశం జిల్లాలో

  • గిద్దలూరు
  • దర్శి నియోజకవర్గాలు జనసేనకి పూర్తి అనుకూలం.

నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ/రూరల్ లేదా జిల్లాలో ఎక్కడైనా ఒక సీటు జనసేనకి కేటాయిస్తే, జనసేన ఆ సీటుని గెలవడంతోపాటు, కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది.

చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాల్లో జనసేనకి మంచి పట్టు వుంది.

అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన గెలిచేందుకు అవకాశాలెక్కువ.

కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం జనసేనకు అనుకూలం. కింది స్థాయిలో క్యాడర్ ఇక్కడ బలంగా వుంది జనసేన పార్టీకి.

కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి అడ్వాంటేజ్ వుంది.

అడ్వాంటేజ్, అవకాశం, సానుకూలతలు.. ఇవన్నీ ఇంకా టిక్కెట్లు ఖాయం కాక ముందున్న పరిస్థితులు. అయితే, టీడీపీ నిర్వహిస్తున్న అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం నిరూపితమవుతోందిట. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జనసేన రానున్న రోజుల్లో ఇంకాస్త పుంజుకునేందుకు వీలుంది.

ఎలా చూసినా, జనసేన పార్టీకి 70కి పైగా సీట్లలో స్ట్రాంగ్ హోల్డ్ కనిపించొచ్చు. ఆ స్థాయిలో జనసేనకు టీడీపీ పొత్తులో భాగంగా సీట్లు కేటాయించగలిగితే.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యేందుకు అవకాశాలు సుస్పష్టం.

ఖచ్చితంగా గెలిచే 42 సీట్లకు అదనంగా మరో ముప్ఫయ్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఆ ముప్ఫయ్‌కి పైగా సీట్లలో జనసేన క్యాడర్ పూర్తి ఉత్సాహంతో కనిపిస్తోంది. పైన చెప్పుకున్న 42 నియోజకవర్గాలకు అనుబంధంగానే ఈ 30కి పైగా నియోజకవర్గాలూ వున్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే.. అన్న కోణంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ క్యాడర్ సమాయత్తమయిన దరిమిలా, పోటీ చేసే సీట్ల విషయమై టీడీపీని డిమాండ్ చేసే పొజిషన్‌లో జనసేన నిలబడింది.

అదే సమయంలో, చావో రేవో అన్న పరిస్థితి వుంది గనుక, టీడీపీ ‘సజావుగా ఓటు ట్రాన్స్‌ఫర్’ ఇరు పార్టీల మధ్యా జరిగేలా, జనసేన అడిగినన్ని సీట్లు ఇవ్వక తప్పకపోవచ్చు. 50 ప్లస్ సీట్లలో జనసేన విజయ ఢంకా మోగించగలిగితే, ముఖ్యమంత్రి పదవి విషయమై డిమాండ్ చేయడానికీ జనసేన పార్టీకి ఆస్కారం ఏర్పడుుతందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

చివరగా.. వెయ్యి, పదిహేను వందలు.. అంతకంటే తక్కువ.. వంద, రెండొందల ఓట్ల తేడాతో గెలిచే అవకాశం వున్న సీట్లను పరిగణనలోకి తీసుకుంటే, జనసేన ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల సంఖ్య (పొత్తులో భాగంగా) 60 నుంచి 65 పైనే వుండొచ్చునట.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...