Switch to English

జగన్‌ రెడ్డి వర్సెస్‌ పవన్‌ నాయుడు.. వాట్‌ నెక్స్‌ట్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,462FansLike
57,764FollowersFollow

‘పాలన చేతకాక.. కాపు నేతలతో తిట్టిస్తారా.? ముందు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించండి.. ఆ తర్వాత నా మీద ఫోకస్‌ పెట్టండి.. నాకేమీ సమస్య లేదు. మీరు వైసీపీ కార్యకర్తలా కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిలా వ్యవహరించండి..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, సూటిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ప్రశ్నిస్తే, పవన్‌ ఊహించినట్లే.. కాపు నేత వైసీపీ తరఫున, వైసీపీ ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తరఫున మీడియా ముందుకొచ్చి, పవన్‌ కళ్యాణ్‌పై ఎడా పెడా విమర్శలు చేసేశారు.

‘పవన్‌ నాయుడు’ అంటూ ఎద్దేవా చేసేసిన ఆ వైసీపీ నేత ఎవరో కాదు, మంత్రి పేర్ని నాని. ఒక్కసారి కాదు, ఒకటికి వందసార్లు పవన్‌ కళ్యాణ్‌ని ఉద్దేశించి ‘పవన్‌ నాయుడు’ అంటూ సంబోదించారాయన. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని వైఎస్‌ జగన్‌ అనీ, జగన్‌ అనీ, జగన్‌ రెడ్డి అనీ అనడం కొత్తేమీ కాదు. పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే ‘జగన్‌ రెడ్డి’ అనకూడదని బహుశా వైసీపీ కొత్త రాజ్యాంగంలో రాసుకున్నారేమో.

నిజానికి, పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ తన పేరు చివర్న ‘నాయుడు’ అని పెట్టుకోలేదు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే గనుక, పేర్ని నాని, పవన్‌ కళ్యాణ్‌ని ‘పవన్‌ నాయుడు’ అని ప్రస్తావిస్తే అందులో తప్పుపట్టడానికేమీ లేదనుకోండి.. అది వేరే విషయం. ‘పవన్‌ నాయుడు’ అనడానికి మాత్రం పేర్ని నాని చాలా కష్టపడాల్సి వచ్చింది. పవన్‌ ప్రెస్‌మీట్‌ ఇలా అవగానే, పేర్ని నాని.. అలా మీడియా ముందుకు దూసుకొచ్చారంటే, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎంత పక్కాగా ఆదేశాలు జారీ చేశారో అర్థం చేసుకోవచ్చు.

ఇంతకీ, ఇసుక కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన భవన నిర్మాణ రంగ కార్మికుల మాటేమిటి.? తెలుగు మీడియంపై చిన్న చూపు వద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్న భాషాభిమానుల మాటేమిటి.? మంత్రి స్థాయిలో పేర్ని నాని.. ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు. అవును మరి, వైఎస్‌ జగన్‌ ఆయన్ని పురమాయించింది పవన్‌ కళ్యాణ్‌ని ‘పవన్‌ నాయుడు’ అని ప్రొజెక్ట్‌ చేసేందుకే. పవన్‌ కళ్యాణ్‌కి ముగ్గురు భార్యలు.. పవన్‌ నాయుడు.. నెక్స్‌ట్‌ ఏంటి.? వైసీపీ ఇంకో కొత్త ప్రస్తావన వెతుక్కోవాలేమో పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించేందుకు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....