చైనా అధ్యక్షుడికి.. అక్కడ కరోనా పెద్ద భూతంలా కనిపించింది.. అమెరికా అధ్యక్షుడే కరోనా వైరస్ దెబ్బకి విలవిల్లాడిపోతున్నాడు. నిజానికి.. వాళ్ళిద్దరికీ కరోనా వైరస్ రాలేదు. కానీ, తమ ప్రజల పట్ల వారి బాధ్యత అలాంటిది.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు. చైనా అయితే, ఏకంగా ఓ నగరాన్ని దిగ్బంధం చేసేసింది. అమెరికాలోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి.
పరిస్థితిని తీవ్రతను గురించిన భారత ప్రభుత్వం కూడా రాష్ట్రాలన్నిటికీ మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వమూ చర్యలు తీసుకుంటోంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మీడియా ముందుకొచ్చి.. రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవ్వొద్దంటూనే, చాలా జాగ్రత్తలు సూచించారు. పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పలేదుగానీ.. తక్కువమంది అతిథులతో కానిచ్చేయమన్నారు.. అదీ 31వ తేదీ లోపు. ఆ తర్వాత అసలు పెళ్ళిళ్ళ జోలికే వెళ్ళొద్దన్నట్లుగా సంకేతాలు పంపారు.
కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు అందుకు భిన్నంగా వుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడ్డం వైఎస్ జగన్‌కి నచ్చలేదు. ‘అది వస్తుంది, పోతుంది.. దాన్ని మరీ అంత సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు..’ అని వెటకారం చేశారు వైఎస్ జగన్. అంతేనా, ‘ఇతర దేశాల్లో వున్న మనవాళ్ళను అక్కడి నుంచి తరిమేస్తారు.. ఆ తర్వాత వారి నుంచి ఆ వైరస్ మనకి వస్తుంది.. అప్పుడు మాత్రం ఏం చేయగలం.? అందుకే, ఇప్పుడు అతి జాగ్రత్తలు అవసరం లేదు..’ అంటున్నారు వైఎస్ జగన్.
ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే, గ్రామ వాలంటీర్లతో ఇంటింటికీ వెళ్ళి పరిస్థితి గురించి వాకబు చేయించేస్తోందట రాష్ట్రంలో ప్రభుత్వం. వాలంటీర్లతో తగ్గే రోగమా ఇది.? ఆసుపత్రులు, వైద్యులు, మందులు.. ఇలా తతంగం చాలానే వుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక, హైద్రాబాద్‌తో సరిసమానంగా వైద్యం అందించే ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.
అలాంటి ఆంధ్రప్రదేశ్, కరోనా వైరస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.? వైఎస్ జగన్ వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధంగానే కన్పించాయి. కరోనా వైరస్ గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి రాజకీయాల గురించి మాట్లాడారు.. కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. అసహన రాజకీయాలకు పరాకాష్ట ఇది.. బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట ఇది.
962208 819635An fascinating discussion is worth comment. I believe that you need to write more on this matter, it could not be a taboo topic but usually individuals are not enough to speak on such topics. To the next. Cheers 160808
63259 198929Wonderful web site. Plenty of useful info here. 550584
743774 630869Why didnt I take into consideration this? I hear exactly what youre saying and Im so pleased that I came across your blog. You truly know what youre talking about, and you produced me feel like I ought to learn a lot more about this. Thanks for this; Im officially a huge fan of your weblog 329519
696205 317666I got what you intend, saved to fav, really nice site . 129976