Switch to English

‘బ్యాడ్‌ బాయ్‌’ ప్రభాస్‌తో జాక్వెలైన్‌ హై ఓల్టేజ్‌ కెమిస్ట్రీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

డార్లింగ్‌ ప్రభాస్‌ కాస్తా బ్యాడ్‌ బాయ్‌గా మారిపోయాడు ‘సాహో’ సినిమా కోసం. అవును, అతన్ని అంత ‘బ్యాడ్‌ బాయ్‌’ చేసేసింది ఇంకెవరో కాదు శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. అసలు విషయమేంటంటే, ‘సాహో’ సినిమా నుంచి లేటెస్ట్‌ సాంగ్‌ ప్రోమో విడుదలయ్యింది. ఇందులో జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. హై ఓల్టేజ్‌.. అనే మాట బహుశా చాలా చిన్నదేమో జాక్వెలైన్‌ పెర్ఫామెన్స్‌ ముందు. జాక్వెలైన్‌ చాలా మంచి డాన్సర్‌ అని ఆల్రెడీ చాలా చాలా సినిమాలతో ప్రూవ్‌ చేసేసుకుంది.

అంతకు మించిన ఎనర్జీని ఈ ‘బ్యాడ్‌ బాయ్‌’ సాంగ్‌లో జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ నుంచి ఆశించొచ్చు. ఆ స్థాయిలో అదరగొట్టేసిందంతే. మరోపక్క ప్రభాస్‌ని చాలా చాలా స్టైలిష్‌గా చూపించారు ‘బ్యాడ్‌ బాయ్‌’ సాంగ్‌లో. సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు జరిగిందో చెప్పడానికి ఈ సాంగ్‌ని కూడా ఓ ఉదాహరణగా చూపించొచ్చు. బోల్డంత మంది మోడల్స్‌ ఈ సాంగ్‌లో దర్శనమిచ్చారు. మోడల్స్‌కి వాడిన కాస్ట్యూమ్స్‌ చాలా చాలా బావున్నాయ్‌. మరోపక్క జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ కాస్ట్యూమ్స్‌ని ఇంకా స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. ఇక, గుర్రాన్ని పట్టుకుని జాక్వెలైన్‌ నడిపిస్తోంటే, ఆ పక్కనే ప్రభాస్‌ బుల్లెట్‌ మీద వస్తుండడం.. ఈ పాటలో వున్న హైలైట్‌ సీన్స్‌లో ఒకటి మాత్రమే.

ఇలాంటివి చాలానే వున్నాయ్‌. ప్రభాస్‌ ఎలాగూ మంచి డాన్సర్‌ కావడంతో, ఈ పాటలో జాక్వెలైన్‌తోపాటు ప్రభాస్‌ నుంచి మంచి డాన్స్‌ని ఆశించొచ్చు. ఆ విషయాన్ని సాంగ్‌ ప్రమోతో దాదాపు కన్‌ఫామ్‌ చేసేశారు. రెండు నిమిషాలకు పైగానే నిడివి వున్న సాంగ్‌ టీజర్‌ని అయితే రివీల్‌ చేశారుగానీ, ముఖ్యమైన డాన్స్‌ బిట్స్‌ని దాచి పెట్టినట్లే కన్పిస్తోంది. సినిమాటోగ్రఫీ అత్యద్భుతం.. అంతకు మించి ఇంకేం చెప్పగలం.! ఇప్పటికే విడుదలైన పాటలతోపాటు ఈ పాట కూడా సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గానే కంపోజ్‌ చేశారు మ్యూజిక్‌ పరంగా. అయితే, పాటలన్నీ స్ట్రెయిట్‌ పాటల్లా కాకుండా, డబ్బింగ్‌ పాటల్లా వున్నాయనే భావన కలుగుతుండడం గమనార్హం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...