Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: కరోనా ‘కట్టడి’ అప్పటికల్లా జరిగేనా.?

మానవ జాతికే పెను సవాల్‌ విసురుతోంది కరోనా వైరస్‌. ఇది మనిషి మనుగడకి ‘కంటికి కనిపించని చాలా చిన్న వైరస్‌’ విసురుతున్న సవాల్‌.. అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్‌ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాల సంఖ్య తక్కువే. కానీ, అది సృష్టిస్తున్న విధ్వంసం మాత్రం.. చాలా చాలా ఎక్కువ. ‘మూడో ప్రపంచ యుద్ధం జరిగినా ఇంత స్థాయిలో విధ్వంసం వుండదేమో..’ అన్న అభిప్రాయాలు పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయంటే కరోనా తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‘హెలికాప్టర్‌ మనీ’ అనే ప్రతిపాదనను ఆ మధ్య తీసుకొచ్చారు. అంటే, కరెన్సీని పెద్దయెత్తున అందుబాటులోకి తీసుకురావడం.. తద్వారా జనంలో కొనుగోలు శక్తిని పెంచడం. ఇది చాలా సాహసోపేతమైన చర్య. కేంద్రం ఆ దిశగా ఆలోచన చేస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ.

పరిస్థితి తీవ్రతని కేసీఆర్‌ మాటలు చెప్పకనే చెబుతున్నాయి. చాలా ప్రపంచ దేశాలు ముందు ముందు ఈ ఆలోచన చేయక తప్పదేమో. మన దేశం విషయానికొస్తే, లాక్‌ డౌన్‌ మే నెల 3వ తేదీ వరకూ పొడిగిచింది కేంద్రం. ఈ నెల 20 నుంచి హాట్‌ స్పాట్స్‌ కాని ప్రాంతాల్లో కొన్ని సడలింపులు వుంటాయి. అయితే, ఆ సడలింపుల తర్వాత పరిస్థితులు ఎలా తారుమారవుతాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

తెలంగాణలో నిన్న నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10 లోపే. దాంతో, ‘హమ్మయ్యా..’ అనుకున్నారంతా. అంతలోనే, కేసుల సంఖ్య పెరిగింది. ఈ రోజు ఏకంగా 50 కేసులు నమోదయ్యాయి తెలంగాణలో. అంటే, చాపకింద నీరులా కరోనా వైరస్‌ దేశంలో చాలా చోట్ల విస్తరించేసిందన్నమాట.

దేశంలో 300కి పైగా జిల్లాల్లో కరోనా అస్సలేమాత్రం లేదని కేంద్రం చెబుతుండడం ఊరటనిచ్చే విషయమే. కానీ, అక్కడ జరగాల్సిన రీతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. గ్రీన్‌ జోన్స్‌లోనే కాదు.. ఆరెంజ్‌ జోన్స్‌, హాట్‌ స్పాట్స్‌లోనూ.. యుద్ధ ప్రాతిపదికన కరోనా టెస్ట్‌లు చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.

మరి, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాయో ఏమో. పరిస్థితి ఇంత తీవ్రంగా కన్పిస్తుండడంతో మే 3 నాటికి అయినా లాక్‌డౌన్‌ ఎత్తివేత జరుగుతుందో లేదో తెలియడంలేదు.

సినిమా

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

ఎన్.టి.ఆర్ కాకపోతే వెంకీ – నానిలకి ఫిక్స్ అంటున్న త్రివిక్రమ్.?

కరోనా అనేది లేకుండా ఉంటే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా కోసం...

రాజకీయం

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏదీ.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే వుండిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమయ్యింది. అయితే, అప్పట్లో అమరావతికి మద్దతిచ్చిన...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...

భారీ బడ్జెట్ వెనక్కి – తెలంగాణ ఫిల్మ్ ముందుకి @ నాని

యంగ్ హీరో నాని సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నన్ను ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబందించిన అన్నీ రెడీ చేసుకుంటారు, ఈ...

తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై మళ్ళీ వార్తలు

నందమూరి తారక రామారావు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు....

ఎన్టీఆర్‌ బర్త్‌డే.. నారా లోకేష్‌ రికార్డ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సరికొత్త రికార్డులు సృష్టించారు.. అదీ సోషల్‌ మీడియాలో. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు...

ప్చ్.. జగన్ ఏడాది ఆనందం అలా ఆవిరైపోయింది.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలుపొంది శనివారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయితే, ఏడాది ఆనందం ప్రస్తుతం ఆ పార్టీకి అంతగా లేదు. అది ఏ కరోనా కారణంగా అనుకుంటే పొరపాటే....