Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఈ బెజవాడకి ఏమయ్యింది.?

‘రాష్ట్రానికి రాజకీయ పీడ పట్టింది..’ అంటూ ఆంధ్రప్రదేశ్‌లో ‘రచ్చబండ’ కబుర్లలో ఓ ప్రస్తావన ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తోందట. రచ్చబండ.. అంటే, ఇదివరకట్లా జనం గుమికూడే పరిస్థితి లేదు గానీ, ఏ ఇద్దరు ఒక్క చోట కూర్చున్నా ఇదే తరహా చర్చ జరుగుతుండడం ఆశ్చర్యకరమేమీ కాదు. ఆ ‘పీడ’ పేరు కరోనా మాత్రమే కాదు, ఇంకో ‘పీడ’ కూడా వుంది. అదే రాజకీయ నిర్లక్ష్యం.

‘ఆ ఏమవుతుంది కరోనా వస్తే.? జ్వరమొస్తుందట, పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుందట..’ అన్న నిర్లక్ష్యం ఇప్పుడు కొంప కొల్లేరయిపోయేలా చేసిందన్న ఆవేదన చాలామందిలో కన్పిస్తోంది. రాజధాని అమరావతి (మూడు ముక్కలు చేయాలని ప్రభుత్వం అనుకుంటోందనుకోండి.. అది వేరే విషయం) పక్కనే వున్న బెజవాడ నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఆ మాటకొస్తే, గుంటూరు జిల్లాలో పరిస్థితి ఇంకా దారుణంగా వుందనుకోండి.. అది వేరే విషయం. బెజవాడలో పరిస్థితి మరీ దయనీయం.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఇక్కడ ‘కాంటాక్ట్‌’ (ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లు కాంట్రాక్ట్‌ కాదు..) దొరకడంలేదు.

కరోనా పాజిటివ్‌ కేసులుగా తేలుతున్న కొన్ని కేసుల విషయంలో, అసలు బాధితులకు కరోనా వైరస్‌ ఎవరిని నుంచి సోకిందో తెలియకపోవడం భయాందోళనలకు కారణమవుతోంది. అహా అద్భుతం.. ఒహో అద్భుతం.. ‘నీ .. డాష్‌ డాష్‌..’ అంటూ అదే జిల్లాకి చెందిన ఓ మంత్రిగారు రాజకీయ ప్రత్యర్థులపై బూతులు మాట్లాడటం మీద పెట్టే ఫోకస్‌, తన జిల్లా ప్రజల మీద పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాసం వుంటోన్న ప్రాంతానికి కూత వేటు దూరంలోనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. అటు వెళితే గుంటూరు.. ఇటు వెళితే విజయవాడ.. ఇదీ కరోనా స్వైర విహారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో.! నిర్లక్ష్యం.. అడుగడుగునా నిర్లక్ష్యం.. పాలకులదీ, ప్రజలదీ నిర్లక్ష్యమే.. అందుకే బెజవాడకి ఇప్పుడీ దుస్థితి.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: మృత్యుబావి మర్డర్ మిస్టరీ – స్లీపింగ్స్ పిల్స్ తో 9 హత్యలు.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల ఉదంతం గత కొద్ది రోజులుగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఈ మృతదేహాల పోస్ట్...

6 ఏళ్ల ‘మనం’ జర్నీలో ఆసక్తికర విషయాలు కొన్ని.!

తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వంశానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలియంది కాదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున దిగ్విజయంగా కొనసాగిస్తే.. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ తో...

బాహుబలి నిర్మాతలు కూడా ఆ రూట్లోనే వెళుతున్నారు

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు అన్నీ మూసివేశారు. గత 70 రోజుల నుండి థియేటర్లు తెరుచుకోవట్లేదు. ఇది మరికొంత కాలం కొనసాగే అవకాశముంది. థియేటర్లు త్వరలో తెరుచుకున్నా కానీ ప్రేక్షకులు ఎంత...

క్రైమ్ న్యూస్: అంకుల్‌తో కలిసి అమ్మే నాన్నను చంపేసిందని చెప్పిన 12 ఏళ్ల బాలుడు

అక్రమ సంబంధాలు ఎంతటి దారుణంకు ఒడిగట్టేందుకు అయినా ఉసిగొల్పుతాయని మరోసారి నిరూపితం అయ్యింది. హైదరాబాద్‌ లాలా పేటకు చెందిన నాగభూషణం ఇటీవల మృతి చెందాడు. ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లుగా భావించి...