‘మేం అస్సలు అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్ములు వెళ్ళేలా చేస్తున్నాం..’ అంటోంది వైసీపీ సర్కారు.!
సరే.. అది నిజమే అనుకుందాం.! సలహాదారుల సంగతేంటి.? కుప్పలు తెప్పలుగా వైసీపీ సర్కారుకి సలహాదారులున్నారు. ఆ సలహాదారుల కోసం ప్రభుత్వం ఎంత సొమ్ములు ఖర్చు చేస్తోంది.? అసలు ఆ సలహాదారులు ప్రభుత్వానికి ఇస్తున్న సలహాలేంటి.? ఆ సలహాల వల్ల ప్రభుత్వానికి ఉపయోగమేంటి.?
సలహాదారుల వ్యవహారమొక్కటే కాదు, చాలా నామినేటెడ్ పోస్టులు.. వాటికి సంబంధించి ప్రోటోకాల్ కావొచ్చు, ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించిన చెల్లింపులు కావొచ్చు.. ఇవన్నీ ప్రజాధనం నుంచి ఖర్చు చేస్తున్నవే కదా.. అన్నది చాలామంది డౌటానుమానం.
వాలంటీర్ వ్యవస్థనే తీసుకుంటే.. ‘మేం వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించాం..’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గర్వంగా చెప్పుకుంటున్నారు. వారికి అందుతున్న గౌరవ వేతనాలు.. ఆ కారణంగా ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారం.. వీటి లెక్కలకు ఎవరు బదులు చెబుతారు.
ప్రభుత్వంలో వున్నవారు కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వాటిని ఎవరూ ప్రశ్నించకూడదంటే ఎలా.? అంతిమంగా ఇక్కడ ఖర్చవుతున్నదీ.. వృధాగా చేతులు మారుతున్నదీ ప్రజాధనం.
ఉన్నత న్యాయస్థానం సలహాదారుల వ్యవహారంపై సీరియస్ వ్యాఖ్యలు చేస్తోంది. కానీ, అధికార వైసీపీలో చలనం వుండటంలేదు. ఎందుకు వుంటుంది.? ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగుల వ్యవహారంలో ఏం జరిగిందో చూశాం. ఎంత ప్రజాధనం వృధా అయ్యిందో చూశాం.
అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు.. అధికార పార్టీ ప్రచారం కోసం.. అధికార యంత్రాంగాన్ని వినియోగించడం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ‘సలహాదారులు గతంలోనూ వున్నారు.. ప్రభుత్వం తరఫున పబ్లిసిటీ గతంలోనూ జరిగింది..’ అంటే, ఆ గత ప్రభుత్వంలో ఇలాంటివి జరిగాయనే కదా.. టీడీపీని జనం ఇంటికి పంపించింది.?
ఏం సలహాలో ఏంటో.! ప్రతిసారీ న్యాయస్థానాల్లో ప్రభుత్వాలకి మొట్టికాయలే మొట్టికాయలు. న్యాయస్థానాల్లో కేసులు వాదించడానికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన దుస్థితి. అదీ ప్రజాధనమే. అలాంటప్పుడు, ఉత్త సలహాలెందుకు.? ప్రజాధనం వృధా చేయడానికి కాకపోతే.!
480681 890956extremely good post, i undoubtedly enjoy this fabulous web site, persist with it 672971
53825 688889Sounds like some thing lots of baby boomers really should study. The feelings of neglect are there in several levels when a single is over the hill. 523394
505527 105462Hey there! Excellent post! Please when I will see a follow up! 363633
420596 985516I genuinely enjoy your site, but Im having a issue: any time I load 1 of your post in Firefox, the center of the internet page is screwed up – which is bizarre. Might I send you a screenshot? In any event, keep up the superior function; I surely like reading you. 866792
746613 468457Wohh just what I was searching for, thanks for putting up. 937745
599493 503919Cool text dude, maintain up the good work, just shared this with the mates 427948
896835 51760Wow, cool post. Id like to write like this too – taking time and real effort to make a good article but I procrastinate too considerably and never seem to get started. Thanks though. 883151