‘మా రేంజ్ పెరిగింది.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి ఫిర్యాదు చేసే స్థాయిలో మేమున్నాం..’ అంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు విర్రవీగుతున్న వైనం సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ‘మాకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు.. మేం ఏమైనా చేస్తాం..’ అనే అహంకారంతో రెచ్చిపోతోన్న వైసీపీ ‘మూకలకు’ న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు ‘ముకుతాడు’ వేస్తోన్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థపైనా అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఏకంగా న్యాయమూర్తుల్ని కరోనా రోగుల గదిలో పడేస్తామంటూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు కొందరు వైసీపీ మద్దతుదారులైన నెటిజన్స్. ఈ విషయంలో వైసీపీ నేతలు కొందరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘ఇలాంటి చర్యల్ని ఉపేక్షించబోం..’ అంటూ గతంలోనే ఘాటుగా స్పందించిన హైకోర్టు, ఈ కేసుని తాజాగా సీబీఐకి అప్పగించింది.
‘ఇంత సీరియస్ అంశంపై ఇప్పటిదాకా అరెస్టులు ఎందుకు జరగలేదు.?’ అని ఇటు సీఐడీని, అటు రాష్ట్ర ప్రభుత్వాన్నీ ప్రశ్నించింది న్యాయస్థానం. ‘మేం చర్యలు తీసుకుంటున్నాం..’ అంటూ సీఐడీ, ప్రభుత్వం చెప్పిన విషయాల పట్ల న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ‘న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు..’ అని వ్యాఖ్యానించిన న్యాయస్థానం, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించడంతోపాటు, ‘సీబీఐకి సహకరించాలి’ అని ప్రభుత్వానికి, సీఐడీకి సూచించడం గమనార్హం.
కొందరు వైసీపీ నెటిజన్లు విదేశాల్లో వుండి సోషల్ మీడియా ద్వారా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్న దరిమిలా, వారిపై ఇంటర్ పోల్ సాయంతో చర్యలు తీసుకోవడానికి సీబీఐ విచారణ ఉపయోగపడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా, రాష్ట్రంలో చాలా కేసులు సీబీఐ విచారణకు వెళుతుండడం, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను చాటి చెబుతోందన్న విమర్శలున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతల ప్రమేయం వున్న కేసుల్లో పోలీసు వ్యవస్థ చూసీ చూడనట్లు వ్యవహరించడమే దీనికి కారణమన్నది రాజకీయ పరిశీలకుల వాదన.
656655 316942This plot doesnt reveal itself; it has to be explained. 529664
679962 771385quite good post, i surely enjoy this incredible site, persist in it 684226
109168 991396Thanks for blogging and i enjoy the weblog posting so no public comments.,,,,,,,,,,, 536324
48870 488188In the event you have been injured as a result of a defective IVC Filter, you need to contact an experienced attorney practicing in medical malpractice cases, specifically someone with experience in these lawsuits. 423709