Switch to English

ఇలాంటి సినిమా తీయాలంటే గ‌ట్స్ కావాలి: హీరో శ్రీ‌కాంత్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,563FansLike
57,764FollowersFollow

శ్రీ‌కాంత్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, రాహుల్ విజ‌య్‌, శివాని ముఖ్య‌తార‌లుగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అభినంద‌న‌ల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంటూ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా విజ‌య‌ప‌థంలో దూసుకెళుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాతల్లో ఒక‌రైన బ‌న్నీవాస్ మాట్లాడుతూ సినిమా కంటెంట్ బాగుంటే మీడియా త‌ప్ప‌కుండా ప్రోత్స‌హిస్తుంద‌నే విష‌యాన్నీ ఈ చిత్రానికి వారు అందిస్తున్న స‌పోర్టుతో మ‌రో సారి ప్రూవ్ అయింది. నాయ‌ట్టు అనే క్లాసిక్ చిత్రాన్ని తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో చేస్తున్న‌ప్పుడు మొద‌ట్లో కాస్త భ‌య‌ప‌డ్డాను. కానీ ఈ రోజు మీడియా రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా వుంది. నిజాయితీగా సినిమా చేశాం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. మార్నింగ్ వ‌సూళ్లు త‌క్కువ వున్నా ఫ‌స్ట్ షో టైమ్‌కు మౌత్‌టాక్ తో క‌లెక్ష‌న్లు పెరిగాయి. ఇదే మా సినిమా స‌క్సెస్‌కు నిద‌ర్శ‌నం. ఓ మంచి సినిమా తీశాను అది జ‌నాల‌కు న‌చ్చింద‌నే విష‌యాన్ని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్ప‌గ‌ల‌ను. తేజ మార్ని ఎంతో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడు. ఈ రోజు చిత్రంలో ప్ర‌తి స‌న్నివేశానికి క్లాప్స్ ప‌డుతున్నాయంటే అత‌నే కార‌ణం. భ‌విష్య‌త్‌లో అత‌ను మంచి క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడిగా ఎదుగుతాడు. శ్రీ‌కాంత్ అన్న‌య్య సొసైటీకి ఉప‌యోగ‌ప‌డే పాత్ర ఎప్పూడు చేసిన ఆ సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని ఈ చిత్రం మ‌రోసారి నిరూపించింది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం మ‌రింత జ‌నాద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది* అన్నారు.

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ మీడియా మిత్రులు చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తుంటే ఆనందంగా వుంది. ఖ‌డ్గం, ఆప‌రేష‌న్ దుర్యోద‌న రోజులు గుర్తొచ్చాయ‌ని అంద‌రూ అంటున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్ర‌శంస‌లు రాలేదు. ఇలాంటి సినిమా తీయాలంటే గ‌ట్స్ వున్న నిర్మాత‌లు కావాలి. ఆ గ‌ట్స్ నాకు వాసు, విద్య‌లో క‌నిపించాయి. మొద‌ట్లో ఈ చిత్రంలో నా పాత్ర‌ను చేయ‌గ‌ల‌నా అనుకున్నాను. కానీ ధైర్యంగా ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. నా కెరీర్‌ను మ‌లుపుతిప్పిన గీతా ఆర్ట్స్ సంస్థ‌లో మ‌ళ్లీ నాకు మ‌రో మంచి స‌క్సెస్ రావ‌డం సంతోషంగా వుంది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు తేజ గొప్ప ద‌ర్శ‌కుడుగా ఎదుగుతాడు అన్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి , అంద‌రి స‌హ‌కారంతో చేసిన ఈ సినిమాకు ఈ రోజు ఇంత మంచి ఆద‌ర‌ణ దొర‌క‌డం హ్య‌పీగా వుంద‌ని ద‌ర్శ‌కుడు తేజ మార్ని తెలిపారు. శివాని మాట్లాడుతూ సినిమాలో నా న‌ట‌న గురించి అంద‌రూ అమ్మ‌కు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. మంచి కంటెంట్‌తో సినిమ తీస్తే తెలుగు ఆడియ‌న్స్ ఎప్పూడు ఆద‌రిస్తార‌ని ఈ చిత్ర విజ‌యం మ‌రోసారి నిరూపించింది. మౌత్ టాక్‌తో ఈ సినిమాకు ఆద‌ర‌ణ పెరుగుతుంది. ఇదే ఈ చిత్ర స‌క్సెస్‌కు నిద‌ర్శ‌నం అన్నారు.

హీరో రాహుల్ విజ‌య్ మాట్లాడుతూ ఇదొక నిజాయితీ అంటెప్ట్‌. సొసైటిలో జ‌రుగుతున్న దానికి రిఫ్ల‌క్ష‌న్ ఇది. శ్రీ‌కాంత్ గారి పాత్ర నా క‌ళ్ల‌లో నీళ్లు తెప్పించింది. నా పాత్ర‌కు కూడా మంచి ప్ర‌శంస‌లు వస్తున్నాయి అన్నారు. సినిమా విజ‌యం ప‌ట్ల స‌హ నిర్మాత భాను త‌న ఆనందాన్ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్ విడుదల

ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం ముందునుంచి చెబుతున్నట్టుగానే "రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి" ట్రైలర్ ఎంతో వైవిధ్యంగా...

Gautham Menon: ధృవ నక్షత్రం విషయంలో మనశ్శాంతి లేదు: గౌతమ్ మేనన్...

Gautham Menon: విక్రమ్ (Vikram) హీరోగా ప్రముఖ స్టార్ డైరక్టర్ గౌతమ్ మేనన్ (Gautham Menon) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ధృవ నక్షత్రం’ (Dhruva Nakshatram)....

Gaganyaan: ‘గగన్ యాన్ వ్యోమగామి నా భర్త..’ గర్వంగా ఉందన్న హీరోయిన్

Gaganyaan: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర 'గగన్ యాన్' (Gaganyaan) కు సర్వం సిద్ధమవుతోంది. యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని...

Rana Daggubati: ఆ అవయువాలు దానం చేసి నా గురించి అడగండి:...

Rana Daggubati: ‘నా ఆరోగ్యం గురించి ఎవరికైనా అడగాలనుంటే ముందు మీ కన్ను, కిడ్నీ దానం చేసే ఆలోచన ఉంటేనే అడగండి.. లేదంటే అవసరం లేద’న్నారు...

Radisson: డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు..! పోలీసులు ఏమన్నారంటే..

Radisson: సంచలనం రేపుతున్న రాడిసన్ (Radisson) హోటల్ డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ (Krish) పేరు వార్తల్లోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ...

రాజకీయం

జనసేనాని పవన్ కళ్యాణ్ పవర్ పంచ్: నువ్వే నా పెళ్ళాం.! రా జగన్.!

అయిపోయింది.! ఈ మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో అనేయొచ్చు. కానీ, ఆగారు.. ఆలోచించారు.! చివరికి, అనేయక తప్పలేదు.! పవన్ కళ్యాణ్ అన్నారనడం కాదు, ఆ మాట అనిపించుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్...

వాలంటీర్లనే నమ్ముకున్న వైసీపీ.! మునుగుతుందా.? తేలుతుందా.?

వాలంటీర్లతో దున్నేద్దాం.. ఈ మాట దాదాపు అందరు వైసీపీ నేతల నోటి నుంచీ వినిపిస్తోంది. ప్రజలతో వైసీపీకి అనుకూలంగా ఓట్లేయించే బాధ్యత పూర్తిగా వాలంటీర్లదేనని వైసీపీ నేతలు అంటున్నారు. ‘వైసీపీకి ఓటెయ్యించకపోయారో.. మీ...

జనసేనానికి ఉచిత సలహాలు.! ‘స్పేస్’లతో ప్రయోజనమేంటి.?

అప్పటిదాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానులు.! కాదు కాదు, ఆ ముసుగులో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు బిల్డప్.! సమయం చూసి, వెన్నుపోటు పొడవడం.! ఒకప్పుడు చిరంజీవికి ఎదురైన పరిస్థితులే ఇప్పుడు...

మహిళా నేతని పరిగెత్తించి కొడతానన్న మంత్రి.! ఏపీ పోలీస్.. మీరెక్కడ.?

రాజకీయం మరీ ఇంతలా దిగజారిపోతుందా.? ఏ కాలంలో వున్నారు మీరంతా.? ఆల్రెడీ దిగజారిపోయింది. ఆడా లేదు, మగా లేదు.. సిగ్గు లేకుండా తిట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు. ప్రజలకు సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చి,...

అదేంటి బండ్ల గణేషా.. మంత్రి రోజా మీద అంత ‘నింద’ వేసేశావ్.?

డైమండ్ రాణి.. ఈ సెటైర్ తొలిసారిగా వేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ నేత, సినీ నటి, మంత్రి కూడా అయిన నగిరి ఎమ్మెల్యే రోజా మీద రాజకీయ విమర్శలో భాగంగా...

ఎక్కువ చదివినవి

Teja Sajja : తేజా సజ్జా తదుపరి సినిమా ఏంటో…?

Teja Sajja : యంగ్‌ హీరో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ మంచి కమర్షియల్‌ హిట్స్ అందుకుంటూ కెరీర్‌ లో దూసుకు పోతున్నాడు. బాల నటుడి నుంచి ప్రమోషన్ పొంది హీరోగా...

ఆయన్ను  మైండ్‌లో పెట్టుకునే ‘చారి 111’ రాశా – దర్శకుడు కీర్తీ కుమార్

'మళ్ళీ మొదలైంది'తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్... ఆ తర్వాత తీసిన సినిమా 'చారి 111'. 'వెన్నెల' కిశోర్ టైటిల్ రోల్ చేశారు. ఆయన సరసన సంయుక్తా విశ్వనాథన్ నటించారు. బర్కత్...

Jahnavi: అమెరికాలో జాహ్నవి మృతి కేసు.. పోలీసు తప్పులేదన్న అధికారులు

Jahnavi: అమెరికా (America) లో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి (Jahnavi) కందుల మృతి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జనవరి 2023లో సియాటెల్ పోలీసు అధికారి కెవిన్...

Prabhas : ప్రభాస్‌ కొత్త సినిమా అప్‌డేట్‌..!

Prabhas : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక...

Janasena: ఇరవై నాలుగు ప్లస్ మూడు.! జనసేనకి సరిపోతాయా.?

టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లనీ, 3 లోక్ సభ సీట్లనీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కేటాయించగలిగారు. ఇలా అనడం కరెక్టా.? గెలిచే అవకాశం...