దర్శకుడిగా గౌతమ్ మీనన్ కు ఒక శైలి ఉంది. తన స్టైల్ టేకింగ్ నచ్చే అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. రొమాన్స్ ను, యాక్షన్ ను మిక్స్ చేసి ఒక అందమైన కథ రాయడంలో గౌతమ్ మీనన్ శైలి వేరు. ఈ దర్శకుడికి ప్లాప్ సినిమాలు ఉండొచ్చు కానీ అవి కూడా ఇప్పుడు బుల్లి తెర మీద వేసుకుంటే హాయిగా చూసేయొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. ఈ రోజు నుండి కొన్ని సడలింపులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అటువంటివేం లేవని మే 3 వరకూ లాక్ డౌన్ కచ్చితంగా అమలవుతుందని ప్రకటించాయి.
ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఇంటి నుండి బయటకు రాలేని పరిస్థితిలో జనాలు సినిమాలను, వెబ్ సిరీస్ లను తెగ చూసేస్తున్నారు. పాత సినిమాలను కూడా రీ విజిట్ చేస్తున్నారు. ఇవి యూట్యూబ్ ఛానల్స్ కు, డిజిటల్ స్ట్రీమింగ్ సైట్స్ కు, టివి ఛానల్స్ కు లాభాలు తీసుకొస్తున్నాయి.
ఇదిలా ఉంటే దర్శకుడు గౌతమ్ మీనన్ మాత్రం తన సినిమాల్లో రెండిటిని మాత్రం ఈ లాక్ డౌన్ సమయంలో చూడొద్దు అంటున్నాడు. అవే సాహసం శ్వాసగా సాగిపో, ఎంతవాడు గాని.. దీని వెనకాల రీజనింగ్ కూడా ఇచ్చాడు దర్శకుడు. అదేంటంటే ఈ రెండు సినిమాల్లో హీరోలు రోడ్ ట్రిప్ మీద వెళతారు. అక్కడ వారికి డిఫరెంట్ ఛాలెంజ్ లు ఎదురవుతాయి. సో ఈ లాక్ డౌన్ సమయంలో ఇలా రోడ్ ట్రిప్ సినిమాలు చూస్తే జనాలకు కూడా అలా వెళ్ళాలి అనిపిస్తుంది కాబట్టి ఈ లాక్ డౌన్ సమయంలో ఈ రెండు సినిమాలను అవాయిడ్ చేయమంటున్నాడు.
850743 954803Outstanding weblog here! right after reading, i decide to buy a sleeping bag ASAP 563101
145988 982866I will tell your pals to visit this internet site. .Thanks for the article. 888123
712036 258735I truly love the theme on your internet site, I run a internet site , and i would adore to use this theme. Is it a totally free style, or is it custom? 926041