అగ్రరాజ్యం అమెరికా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆకలితో అల్లాడుతోంది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేకపోవడంతో రాత్రికి రాత్రే దాదాపు 2 కోట్ల మంది రోడ్డున పడ్డారు. గతంలో ఎన్నడూ ఫుడ్ బ్యాంకుల వైపు కన్నెత్తి చూడనివారు సైతం ఆహార పదార్ధాల కోసం కిలోమీటర్ల కొద్దీ లైనులో నిరీక్షిస్తున్నారు.
ఇక మనదేశంలోనూ పరిస్థితి ఘోరంగా ఉంది. నెల రోజుల నుంచి లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. ప్రభుత్వాలు రేషన్, నగదు ఇస్తున్నప్పటకీ.. రేషన్ కార్డుల్లేని వలస కూలీల వ్యధలు ఎన్నో ఉన్నాయి. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయి తిండీ తిప్పల్లేక అల్లాడుతున్న అభాగ్యులు లక్షల్లో ఉన్నారు.
ఢిల్లీలో ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టే భోజనం కోసం ఎండలో కిలోమీటర్ల పైబడిన క్యూలో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత పలువురు కార్మికులు స్వస్థలాలకు కాలినడకనే వెళ్లిపోగా.. పలువురు మాత్రం ఏప్రిల్ 14 వరకు వేచిచూశారు. కానీ లాక్ డౌన్ ను పొడిగించడంతో ఇక ఆగ్రహం పట్టలేకపోయారు. తమను ఊరికి పంపించేయాలంటూ ముంబై బాంద్రా స్టేషన్ కి వేలాదిగా వలస కార్మికులు తరలి వచ్చారు. అయితే, లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో వారిని పంపించడం కుదరదని మహా సర్కారు తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా వలస కార్మికులు రాష్ట్రం పరిధిలో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లొచ్చని పేర్కొంది. అయితే, మొత్తం లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో వారు సొంతూరికి మినహా ఎక్కడికి వెళ్లినా ఉపయోగం ఉండదు. తెలంగాణలో వలస కూలీలను కూడా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. మిగిలిన రాష్ట్రాలు ఇలాంటి వారిని ఎంతవరకు ఆదుకుంటాయనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇప్పటికే ఆకలికి తాళలేక సొంతూరికి కాలినడకన బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నించిన కూలీల్లో దాదాపు 200 మంది అసువులు బాసారని అంచనా. దీంతో కరోనా నుంచి తప్పించుకోవడానికి విధించిన లాక్ డౌన్ కారణంగా ఆకలి చావులు సంభవిస్తున్నాయి.
వీటన్నింటినీ చూసి కలత చెందిన సంగీతకారుడు పూజన్ సాహిల్.. బూఖ్ అనే పేరుతో ఓ పాట స్వరపరిచారు. బూఖ్ అంటే ఆకలి అని అర్థం. కరోనా నుంచి తప్పించుకున్నా.. ఆకలితో చావడం ఖాయం అనే అర్థం వచ్చే రీతిలో ఈ పాట సాగుతుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
284454 623227You made some decent points there. I looked on the web for the dilemma and discovered most individuals will go coupled with along with your web site. 810298
668437 377578you use a amazing weblog here! do you need to have to make some invite posts on my blog? 481816
888333 720868informatii interesante si utile postate pe blogul dumneavoastra. dar ca si o paranteza , ce parere aveti de inchirierea apartamente vacanta ?. 657091
301220 975659Perfect just what I was looking for! . 733912
309570 286106Should you are interested in envision a alter in distinct llife, starting up normally the Los angeles Surgical procedures fat reduction method is a large movement so that you can accomplishing which generally thought. lose belly fat 548531