Switch to English

గని రివ్యూ: యావరేజ్ నాకౌట్ పంచ్

Critic Rating
( 2.75 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie గని
Star Cast వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర
Director కిరణ్ కొర్రపాటి
Producer సిద్ధు ముద్దా, అల్లు బాబీ
Music ఎస్. థమన్
Run Time 2 గం 29 నిమిషాలు
Release 8 ఏప్రిల్ 2022

వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా గని ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా ఆడియన్స్ ఆర్ ఆర్ ఆర్ హ్యాంగోవర్ లోనే ఉన్న నేపథ్యంలో వారిని ఈ చిత్రానికి కదిలొచ్చేలా చేసే సత్తా ఉందో లేదో చూద్దాం.

కథ:

విక్రమాదిత్య ఒక ఛాంపియన్ బాక్సర్. అయితే స్టెరాయిడ్స్ తీసుకుని బాక్సింగ్ గెలిచాడని తన మీద అభియోగం వస్తుంది. దీంతో తనకు నచ్చిన స్పోర్ట్ ను వదిలేయాల్సిన పరిస్థితి. విక్రమాదిత్య కొడుకు గని (వరుణ్ తేజ్) దీనికి సరైన సమాధానం చెప్పాలి అనుకుంటాడు. అందుకోసం తాను బాక్సింగ్ లో అత్యున్నత స్థాయికి ఎదగాలని కలలు కంటాడు.

అయితే ఇది గని తల్లి (నదియా)కు నచ్చదు. తన తల్లికి తెలీకుండా బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటాడు గని. తాను ఛాంపియన్ అయ్యే ప్రాసెస్ లో ఒకప్పటి విక్రమాదిత్య ప్రత్యర్థి, గనికి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. మరి వీరిద్దరూ కలిసి అనుకున్నది సాధించగలిగారా? తన తండ్రి మీద పడిన మచ్చను తుడిచేయగలిగారా?

నటీనటులు:

గని కోసం వరుణ్ తేజ్ ఎంత కష్టపడ్డాడు అన్నది తెరమీద స్పష్టంగా తెలుస్తుంది. బాడీ పరంగా వరుణ్ చాలా శ్రమించాడు. ఒక బాక్సర్ కు ఉండాల్సిన దేహాన్ని సాధించుకున్నాడు. అలాగే నటన పరంగా పరిణితి సాధించాడు. మొత్తంగా తనవరకూ న్యాయం చేసాడు.

హీరోయిన్ గా చేసిన సాయీ మంజ్రేకర్ కు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. ఫస్ట్ హాఫ్ లో కనిపించిన సాయీ, సెకండ్ హాఫ్ లో ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి.

నవీన్ చంద్ర పాత్రకు మొదట్లో బిల్డప్ బాగుంది కానీ నెమ్మదిగా ఆ పాత్ర కూడా సైడ్ అయిపోతుంది. ఇక వెటరన్స్ ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టిలు ప్రముఖ పాత్రల్లో నటించారు. ముగ్గురూ కూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అంతకు మించి చేయడానికి కూడా పాత్ర స్వభావం అనుమతించలేదు. నదియా మెప్పించింది.

సాంకేతిక నిపుణులు:

ఎస్ ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మెప్పించాడు. అయితే అక్కడక్కడా మరీ లౌడ్ అయిన భావన కలుగుతుంది. పాటల్లో టైటిల్ ట్రాక్ తప్ప మిగతావి అంత గుర్తించుకునేలా లేవు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా బాక్సింగ్ సెటప్ ను బాగా చూపించగలిగాడు. ఎడిటింగ్ కూడా ఓకే. నిర్మాణ విలువలు అదిరాయి. బాగా ఖర్చుపెట్టినట్లు అర్ధమవుతుంది.

ఇక కిరణ్ కొర్రపాటి తీసుకున్న కథ పాతదే. దీనికి ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా రొటీన్ పంథాలోనే సాగింది. పెద్దగా హైస్ అండ్ లోస్ లేకుండా స్క్రీన్ ప్లే సాగింది. అయితే సెకండ్ హాఫ్ లో కథ నుండి పెద్దగా డీవియేట్ కాకుండా నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. దర్శకత్వం ఓకే.

ప్లస్ పాయింట్స్:

  • వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్
  • సపోర్టింగ్ పాత్రలు
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

  • రెండు హాప్స్ స్లో గా మొదలవుతాయి
  • రొటీన్ ట్రీట్మెంట్
  • ఎంటర్టైన్మెంట్ పెద్దగా లేకపోవడం

చివరిగా:

కమర్షియల్ అంశాల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఒక పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామా చేయాలన్న ఆలోచనకు దర్శకుడు, హీరో, నిర్మాతలను మెచ్చుకోవాలి. గని చాలా స్లో గా మొదలై, నెమ్మదిగా పేస్ పెంచుకుంటూ మంచి ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఆగుతుంది. సెకండ్ హాఫ్ పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. కాకపోతే క్లైమాక్స్ లో ఎమోషన్స్ అనుకున్న స్థాయిలో పండలేదు.

గని కి ఉన్న మెయిన్ కంప్లైంట్ రొటీన్ ఫార్మాట్ లో సాగడం. మొత్తంగా చూసుకుంటే ఒకసారి చూడదగ్గ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామా గని.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పదేళ్ల సినీ ప్రయాణం పూర్తి

అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రనిర్మాణ సంస్థలు 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్', 'సితార ఎంటర్టైన్మెంట్స్'. ఈ రెండు నిర్మాణ సంస్థలు నేటితో పదేళ్ల సినీ ప్రయాణాన్ని...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తెలుగు సినిమా చరిత్రలో తొలి 10కోట్ల షేర్.. చిరంజీవి ‘ఘరానామొగుడు’

మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ హీరోగా బాక్సాఫీసు రికార్డుల్ని ఎన్నోసార్లు తిరగరాశారు. ముఖ్యంగా 1987 నుంచి 1992 వరుసగా 6ఏళ్లపాటు ప్రతిఏటా ఒక్కో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తన ఇమేజ్ మాత్రమే కాదు.. తెలుగు...

‘తల్లిని మించిన యోధురాలు లేదు..’ విష సర్పం నుంచి బాలుడిని కాపాడుకున్న తల్లి

‘తల్లిని మించిన యోధురాలు భూమి మీద లేదు’ అని కేజీఎఫ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. దీనిని నిజం చేస్తూ కన్నబిడ్డపై తల్లి ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు కర్ణాటకలోని మాండ్యలో...

గోరంట్ల మాధవుడి లీలలు.! ఇంతకన్నా ఏం ఆశించగలం.?

ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఓ రాజకీయ విశ్లేషకుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా.. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలపైనా.! ‘అక్రమాస్తుల...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మరి ఈరోజే విడుదలైన ఈ...