మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej), సాక్షి వైద్య జంటగా నటిస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. విడుదలని పురస్కరించుకుని ట్రైలర్ ని ఈరోజు విడుదల చేశారు. యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు వరుణ్ తేజ్ తెలిపారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ…’ నటుడిగా ప్రతి ప్రాజెక్టును వైవిధ్యంగా చేయాలని కోరుకుంటాను. ఈ సినిమాలోనూ నాకు అలాంటి వైవిద్యమే కనిపించింది. ప్రవీణ్ సత్తారు ఫోన్ చేసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడు మారు ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. నటుడిగా ఈ ప్రాజెక్టు చేయడం నా బాధ్యతగా భావించాను. ట్రైలర్ లో చూపించిన దాని కంటే ఉన్నతంగా సినిమా ఉంటుంది. చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మన చుట్టూ ఇలా జరుగుతుందా అని ఆలోచించుకుంటూ థియేటర్ నుంచి బయటికి వస్తారు. ఆగస్టు 25న ఈ సినిమా మీ ముందుకి రానుంది. మీ అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈరోజు విడుదలైన ‘జైలర్’ పెద్ద హిట్ అయింది. రేపు పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) నటించిన ‘భోళాశంకర్’ విడుదల కానుంది. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.