Switch to English

అందరి నోటా అదే మాట..!

‘కరోనా వైరస్ చిన్నపాటి జ్వరం వంటిదే. వస్తుంది.. పోతుంది. ఎవరికైనా ఇది వస్తుంది. రేపు నాకు కూడా రావొచ్చు. ఇది ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి లేదు. కరోనాతో మనం కలిసి జీవించాల్సిందే. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నయమవుతుంది’ – ఇవీ ఏపీ సీఎం గతవారం చేసిన వ్యాఖ్యలు. దీంతో నెటిజన్లు జగన్ ను సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇక ప్రతిపక్షాలైతే తీవ్రంగా విరుచుకుపడ్డాయి. కరోనా వైరస్ నియంత్రణలో జగన్ చేతులెత్తేశారని దుయ్యబట్టాయి. పాలన చేతకుంటే తమకు అప్పగించాలని సెటైర్లు వేశాయి.

అంతకుముందు కూడా కరోనా చిన్న జ్వరమని, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని జగన్ చెప్పడంతో చాలామంది విస్తుపోయారు. పారాసిటమాల్ కే తగ్గిపోతే ప్రపంచం అల్లకల్లోలం కావడానికి కారణాలేంటి? ఎన్నో వ్యయప్రయాసలకోర్చి లాక్ డౌన్ విధించుకోవాల్సిన అగత్యమేంటని ప్రశ్నలు సంధించారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని సీఎం స్థాయి వ్యక్తి చెబితే ఎలా అని నిలదీశారు. అయితే, కరోనా విషయంలో ప్రస్తుతం పలువురి అభిప్రాయం ఇదే విధంగా ఉండటం విశేషం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ వరకు ఇదే చెప్పారు. సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొనగా.. కరోనాతో కలిసి సాగాల్సిందేనని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తేల్చి చెప్పారు. కరోనా అనేది ఇప్పటికిప్పుడు తగ్గిపోయేది కాదని పలువురు వైద్య నిపుణులు కూడా స్పష్టంచేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు దాంతో కలిసి జీవించక తప్పదని పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదే వ్యాఖ్య చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. తాజాగా సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని తనదైన స్టైల్లో చెప్పారు. ‘‘ఈ సమస్య రేపో, ఎల్లుండో సమసిపోయేది కాదు. కరోనాతో కలిసి బతకాల్సిందే. ఇది మనల్ని వేటాడుతూనే ఉంటుంది. ఇప్పటివరకు మనల్ని మనమే రక్షించుకున్నాం. ఇక ముందు కూడా మనల్ని మనమే రక్షించుకోవాలి. కొంచెం తెలివి కావాలి. ఉపాయం ఉన్నవాడు అపాయం నుంచి బయటపడతాడు. ఉపాయంతో బతకాలి. ఆ తెలివి మనం సంతరించుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు.

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

‘కరోనా’ అయితే ఏంటి .? దుబాయిలో దోచేస్తున్నాడు.!

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకుల నుంచి...

బాలయ్య కోసం మొదటి టఫ్ టాస్క్ ఫినిష్ చేసిన బోయపాటి శ్రీను

నందమూరి బాలకృష్ణ కెరీర్లో 'సింహా ', 'లెజెండ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో చేస్తున్న మూడవ సినిమా మార్చిలో మొదలై 13 రోజుల షూటింగ్ ని...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

భార్య భర్తలకు కిమ్‌ ఉరిశిక్ష.. క్రూరత్వంకు పరాకాష్ఠ

ఉత్తర కొరియా నియంత పాలకుడు కిం జోంగ్‌ ఉన్‌ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, తన గురించి తప్పుడు ప్రచారం చేసిన వారిని కనీసం కేసు...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏదీ.?

‘మేం అధికారంలోకి వస్తే, కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధిస్తాం..’ అని 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నినదించింది. 2014 ఎన్నికల్లోనూ ఈ ప్రత్యేక హోదా...