Switch to English

ప్రభాస్‌ 21 విలన్‌ ఎవరో తేలిపోయింది

ప్రభాస్‌ తన 20వ చిత్రంను ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ సగానిపి పైగా పూర్తి అయ్యింది. ఈ కరోనా లాక్‌ డౌన్‌ లేకుండా ఉండి ఉంటే జూన్‌ జులై వరకు ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి ప్రభాస్‌ కొత్త సినిమా షూటింగ్‌ షురూ అయ్యేది. ఇప్పటికే ప్రభాస్‌ 21వ చిత్రం సినిమా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఖరారు చేసిన విషయం తెల్సిందే. మహానటి చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రస్తుతం ప్రభాస్‌ 21 చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు.

ఈ ఏడాది చివర్లో ప్రభాస్‌ 21 చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈ చిత్రంలో విలన్‌ పాత్రకు గాను కోలీవుడ్‌ సినియర్‌ స్టార్‌ నటుడు అరవింద్‌ స్వామిని ఎంపిక చేశారు. పాన్‌ ఇండియా మూవీగా ప్రభాస్‌ 21 రూపొందుతోంది. అందుకోసమే అన్ని భాషల నుండి ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన నటీనటుల విషయమై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక పాత్రకు అరవింద్‌ స్వామి అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంకు నాగ్‌ అశ్విన్‌ రావడం అందుకు ఆయనతో మాట్లాడటం కూడా జరిగిందట. ప్రభాస్‌తో మూవీ అంటే అరవింద్‌ స్వామి ఎక్కువగా ఆలోచించకుండా స్టోరీ లైన్‌ విని తన పాత్రకు సంబంధించిన సీన్స్‌ గురించి తెలుసుకుని ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

ఎప్పటి నుండో అరవింద్‌ స్వామికి తెలుగులో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తెలుగులో ఈయన చాలా కాలం తర్వాత ధృవ చిత్రంలో నటించాడు. చరణ్‌ ను ఢీ కొట్టడంలో అరవింద్‌ స్వామి సూపర్‌ హిట్‌ అయ్యాడు. అందుకే ఈ చిత్రంలో ప్రభాస్‌కు పోటీగా సరితూగే అరవింద్‌ స్వామిని ఎంపిక చేశారట.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బాబు’లిద్దరూ హైద్రాబాద్‌లో ఇంకెన్నాళ్ళు.!

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై...

ఇన్‌సైడ్‌ స్టోరీ: టీడీపీ గ్రాఫ్‌ కిందికి.. జనసేన గ్రాఫ్‌ పైపైకి.!

2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంప పెట్టు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అధికారం కోల్పోవడం ఓ ఎత్తయితే.. అత్యంత ఘోరమైన పరాజయం ఇంకో ఎత్తు. మామూలుగా అయితే, ఏ...

వైఎస్‌ జగన్‌తో చిరంజీవి భేటీ.. అతి త్వరలో.!

మెగాస్టార్‌ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ కాబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై వైఎస్‌ జగన్‌తో చిరంజీవి ఈ బేటీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా...

ప్రభాస్ – పూరి.. జరిగే పనేనా?

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఫ్యాన్స్ విషయంలో కొదవ లేదు. ప్రతీ స్టార్ హీరో అభిమాని పూరిని కూడా అభిమానిస్తాడు. తమ హీరోకు పూరి ప్లాప్ ఇచ్చినా సరే మరోసారి తనతో కలిసి...

వద్దన్నా వినడంలేదు.. మళ్లీ అవే రంగులు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయొద్దంటూ ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత ఆ రంగులు మార్చాలంటూ హైకోర్టు ఆదేశించగా.. వాటికి మట్టి రంగును...