Switch to English

ఏమయ్యావమ్మా దిశా.! ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకేది రక్షణ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘దిశ చట్టం వల్లనే గుంటూరులో ఓ యువతి హత్య కేసులో దోషికి అత్యంత తక్కువ కాలంలో శిక్ష పడింది..’ అని అధికార పార్టీ విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంది. అసలు దిశ చట్టం అమల్లోనే వుందా.? అని గట్టిగా ప్రశ్నిస్తే, దానికి కేంద్రం ఆమోదం తెలపలేదు గనుక.. దిశ ఇంకా చట్ట రూపం దాల్చలేదనే సమాధానం వైసీపీ ప్రభుత్వం నుంచి వస్తుంటుంది.

కానీ, దిశ యాప్.. దిశ పోలీస్ స్టేషన్లు.. దిశ వాహనాలు.. ఇలా చాలానే వున్నాయి. పేరులో ఏముంది.? మహిళలకు ఏ పేరుతో రక్షణ కల్పించినా అభినందించాల్సిందే. దిశ ద్వారా మహిళలకు ఎంతమంది మహిళలకు రక్షణ, భద్రత లభించింది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

కానీ, జరుగుతున్న పబ్లిసిటీకీ.. తెరపైకొస్తున్న అఘాయిత్యాలకీ అస్సలు పొంతన వుండడంలేదు. మొన్న విజయవాడ ఘటన, ఆ తర్వాత గుంటూరు ఘటన… ఆ వెంటనే మరో ఘటన.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా వెలుగు చూస్తున్న మహిళలపై అఘాయిత్యాల ఘటనలతో అంతా విస్తుపోతున్నారు.. సగటు మహిళలైతే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

‘మీ హయాంలో ఏం చేశారు.?’ అంటూ ప్రస్తుత ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మీద ఎదురుదాడి చేసినంత శ్రద్ధతో అధికార పక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, మహిళలపై అఘాయిత్యాలు ఆగుతాయి.
గతంలోనూ ఓ మహిళ హోంమంత్రిగా వున్నారు.. ఇప్పుడూ హోం మంత్రిగా మహిళే వున్నారు. కానీ, మహిళలకు ఎందుకు భద్రత కరువయ్యింది.? ఈ విషయమై విపక్షాలు తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఎవరెంతలా ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వమైతే మొద్దు నిద్ర వీడటంలేదు.

‘ఆయా కేసుల్లో నిందితుల్ని వేగంగా అరెస్టు చేయగలిగాం..’ అని మాత్రమే ప్రభుత్వం చెబుతోంది. ఎన్ని కేసుల్లో దోషులకు శిక్షలు పడుతున్నాయ్.? అన్నదానిపై మళ్ళీ స్పష్టత లేదు.
‘మహిళలకు భద్రత లేని రాష్ట్రం..’ అనే ముద్ర ఏపీ మీద పడిపోతోంది.. వరుస అఘాయిత్యాల నేపథ్యంలో. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం సమాధానమిస్తారు.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...