వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైపు వుంటారా.? లేదంటే, తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ముందడుగు వేస్తారా.? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి కోసం పని చేస్తారు.? ఈ విషయమై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
‘నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు..’ అని అంటూనే, తాను ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అని చెప్పకనే చెప్పేశారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ తెలంగాణ స్థాపన వెనుక వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాస్టర్ మైండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘అబ్బే, మేం వద్దని చెప్పినా ఆమె విన్లేదు..’ అని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా, ‘ఆయన అలా అనడం నాకు బాధ కలిగించింది’ అని షర్మిల వాపోయినా.. అదంతా రాజకీయ నాటకంలో భాగమే.
2023 ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర సమితికీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీకీ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ సంస్థ సేవలందించనుంది. ఇదే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి సేవలు అందిస్తోంది. సో, మూడు పార్టీలూ ఒకటేనన్నమాట.
మరి, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య నీళ్ళ పంచాయితీ, కరెంటు పంచాయితీ ఏంటి.? కేటీయార్ ఇటీవల వైఎస్ జగన్ సర్కారు మీద చేసిన వ్యాఖ్యల సంగతేంటి.? అంటే, రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల్ని అయోమయంలోకి నెట్టేయడానికే.. ఈ రాజకీయమంతా.
తెలంగాణ రాష్ట్ర సమితికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ బీ-టీమ్ కాబోతోంది. ఆ రెండు పార్టీలకీ వైఎస్సార్సీపీ తెరవెనుకాల మద్దిస్తుంది. ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో వైసీపీకి, షర్మిల అలాగే కేసీఆర్ మద్దతిస్తారు. ఇదీ ప్రశాంత్ కిషోర్ మాస్టర్ ప్లాన్. కేసీయార్ని ఎంత గట్టిగా షర్మిల విమర్శిస్తే, అంతలా టీఆర్ఎస్ వ్యతిరేక ఓటుని ఆమె చీల్చగలుగుతారని అనుకోవాలా.? అదేం లేదు.. ఇద్దరూ కలిసే పోటీ చేయబోతున్నారా.? కాలమే సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నకి.
208396 362223Really interesting subject , regards for putting up. 261532
869287 630827thank you dearly author , I found oneself this web internet site very beneficial and its full of superb healthy selective information ! , I as nicely thank you for the wonderful food program post. 778271
601445 604604Keep all the articles coming. I adore reading via your points. Cheers. 613817