టాలీవుడ్ లో ఒకరు స్టార్ డైరెక్టర్ – మరొకరు స్టార్ నిర్మాత.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్. కానీ ఇప్పుడు ఆ నిర్మాత ఆ డైరెక్టర్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఆ సినిమానే ‘సీనయ్య’.. ఆ దర్శకుడు నిర్మాతే, వివి వినాయక్ – దిల్ రాజు. ఇటీవలే ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయ్యింది.
నవంబర్ నుంచి సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లనుంది. వినాయక్ హీరోగా సినిమా చేస్తున్నాడు అనగానే ‘సీనయ్య’ అందరి దృష్టి ఆకర్షించింది. ఇదిలా ఉంటే మేము ప్రత్యేకంగా తెలుసుకున్న సమాచారం ప్రకారం సీనయ్య సినిమాకి 20 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారు. వినాయక్ కి క్రేజ్ ఉన్నా ఇది కమర్షియల్ సినిమా కాదు. నిజ జీవిత కథతో రూపొందుతున్న ఎమోషనల్ స్టోరీ. అలాంటి సినిమాకి అంత బడ్జెట్ ఏంటా అందరు షాక్ అవుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. సినిమా లాంచ్ చేసే టైంకి ఆన్ పేపర్ ఉన్న బడ్జెట్ రేంజ్ 20 కోట్లు. ముఖ్యంగా 1980ల కథాంశం కావున అలనాటి సెట్స్ ని వేస్తుండడం వల్ల ఇంత బడ్జెట్ అవుతుందట. ఏ కారణంగా నైనా ఈ బడ్జెట్ అనేది ఎక్కువ కాబట్టి దిల్ రాజు ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ విషయంలో కొత్త వారిని తీసుకొని కొంత బడ్జెట్ తగ్గించాలని చూస్తున్నారు. మరి ఫైనల్ గా సినిమా అయ్యే టైంకి ఏ బడ్జెట్ దగ్గర ఆగుతుందో చూడాలి. నరసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.
622338 955996I agree completely with what you said. Wonderful Stuff. Keep it going.. 289116
814548 326926I like the way you conduct your posts. Have a nice Thursday! 808989
570779 763159Merely wanna input on couple of common points, The site design is perfect, the topic material is rattling superb : D. 960538
219601 98261How a lot of an exclusive write-up, maintain on posting better half 674404
503622 406565An intriguing discussion will probably be worth comment. I believe that you simply write considerably much more about this subject, it might become a taboo topic but generally consumers are inadequate to communicate in on such topics. To an additional. Cheers 978084