బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ నిన్ననే మొదలైంది. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేసారు కూడా.
పూర్తి స్థాయి సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపించబోతున్నాడు. కొత్త తరహా గెటప్, డిక్షన్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నీ సరికొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చిరు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే బయటకు రానున్నాయి.