పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం
సూర్యోదయం: ఉ.5:36
సూర్యాస్తమయం: రా.6:36 ని.లకు
తిథి: ఆషాఢ బహుళ అష్టమి రా.11:23 ని. వరకు తదుపరి ఆషాఢ బహుళ నవమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: రేవతి రా.12:03 ని.వరకు తదుపరి అశ్వని
యోగం: అతిగండ రా.6:12 ని. వరకు తదుపరి సుకర్మ
కరణం: భాలవ మ.12:18 ని. వరకు తదుపరి కౌలవ
దుర్ముహూర్తం: మ.12:32 ని.నుండి 1:21 ని. వరకు తదుపరి మ.3:08 నుండి 4:00 గం.వరకు
వర్జ్యం :మ.12:32 ని.నుండి మ.2:04 ని. వరకు
రాహుకాలం: ఉ.7:30 ని.నుండి 9:00 గం.వరకు
యమగండం: మ.10:30 ని. నుండి 12:00 గం .వరకు
గుళికా కాలం: మ.1:58 ని. నుండి 3:36 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:16 ని.నుండి 5:04 ని.వరకు
అమృతఘడియలు: రా.9:43 ని.నుండి 11:15 ని.వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:55 నుండి మ.12:47 వరకు
ఈరోజు (10-07-2023) రాశి ఫలితాలు
మేషం: రావలసిన బకాయిలు సకాలంలో అందవు. ఖర్చు అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఋణ ప్రయత్నాలు కలసిరావు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి.
వృషభం: స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో స్వంత ఆలోచనలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
మిథునం: బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
కర్కాటకం: అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయంలో సహోద్యోగుల సహాయం లభిస్తుంది.
సింహం: ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపాలు కలుగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకులు తప్పవు. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. సంతాన విద్యా, ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారమున వ్యయప్రయాసలతో అధికమౌతాయి.
కన్య: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్ధిక పరంగా ఇబ్బందులున్నా సౌకర్యాలు లోటు ఉండదు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు పరిష్కారమౌతాయి.
తుల: పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆర్ధిక పరమైన అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల లాభిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం: ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగమున అధికారుల సహాయంతో నూతన పదవులు పొందుతారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
ధనస్సు: ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సన్నిహితుల నుండి ధన ఒత్తిడి పెరుగుతుంది.
మకరం: కొన్ని వ్యవహారములలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసొస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంతానానికి నూతన విద్యావకాశములు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం: చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధు మిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
మీనం: పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయ్యుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానాలు అందుతాయి. వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది
Heello there, just became alert tto your blog through Google, andd fohnd that it’s reslly informative.
I amm goung to watchh outt for brussels.
I’ll appdeciate if yoou continu thos in future. Numerous peoplee
wil bee beneited from yoir writing. Cheers!