Switch to English

Pawan Kalyan: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. నా భార్యనీ, తల్లినీ అవమానిస్తున్నారు: పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: ‘నేను ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాను. మీరేమో, నా తల్లినీ.. నా భార్యనీ తిట్టిస్తున్నారు. ఇవన్నీ నేనెందుకు భరిస్తున్నాను.? కేవలం ప్రజల కోసమే..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరులో నిర్వహించిన వారాహి విజయ యాత్ర సభ సందర్భంగా భావోద్వేగ ప్రసంగం చేశారు.

గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తల్లినీ, పవన్ కళ్యాణ్ భార్యనీ వైసీపీ నేతలు తిడుతున్నారు, తిట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, అత్యంత సంయమనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీని నిలదీశారు.

‘నేను హైద్రాబాద్‌లో వుంటున్నానంటే దానికి కారణం వుంది. నేను సినిమాలు చేయాలి. అందులో సంపాదించింది, కౌలు రైతులకు పంచి ఇవ్వాలి. నీలా నేను దోచుకోలేదు. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఆరు శాతం కమిషన్లు తీసుకున్నారు. మా నాన్న అలా కాదు.. ఆయన అబ్కారీ శాఖలో పని చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఆయన..’ అంటూ తనదైన స్టయిల్లో పంచ్ డైలాగులు పేల్చారు పవన్ కళ్యాణ్.

అంతేనా, ‘పరదాల చాటున పల్లకిలో మహారాణిలా వెళతావు జగన్.. ఈమాత్రందానికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇడుపులపాయ ఎస్టేట్‌లో కూర్చో..’ అంటూ, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘రోడ్స్ డెవలప్‌మెంట్ ఫండ్ ఏమయ్యింది.? కాగ్ లెక్కల ప్రకారం లక్ష కోట్లు మిస్సింగ్ అట.. ఆ లెక్కల సంగతేంటి.? దీనిపై మీ మంత్రులు రేపు ప్రెస్ మీట్ పెట్టి సమాధానమివ్వండి.. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు..’ అంటూ అల్టిమేటం జారీ చేశారు పవన్ కళ్యాణ్ అధికార వైసీపీకి.

‘గడచిన నాలుగేళ్ళలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రెస్‌ని ముఖ్యమంత్రి ఫేస్ చేయలేదు. మీడియా మిత్రుల్ని అడగండి.. ఆయన మీడియా ముందుకొచ్చాడేమో..’ అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం గమనార్హం.

ఇప్పటిదాకా నిర్వహించిన వారాహి విజయ యాత్ర బహిరంగ సభలన్నిటికీ మించిన స్థాయిలో ఏలూరు బహిరంగ సభకు స్వచ్ఛందంగా జనం తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ అత్యంత సంయమనంతో.. అత్యంత వ్యూహాత్మకంగా.. ఇంకా చెప్పాలంటే, అత్యంత బాధ్యతాయుతంగా మాట్లాడిన మీటింగ్‌గా ఏలూరు బహిరంగ సభని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చేమో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...