Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 06 మార్చి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,793FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:19
సూర్యాస్తమయం : సా‌.6:03
తిథి: ఫాల్గుణ శుద్ధ చవితి రా.10:16 వరకు తదుపరి ఫాల్గుణ శుద్ధ పంచమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము : అశ్వని రా.తె. 4:51 వరకు తదుపరి భరణి
యోగం: బ్రహ్మం రా.1:13 వరకు తదుపరి ఐంద్రం
కరణం: వనిజ ఉ.10:02 వరకువిష్టి
వర్జ్యం: రా.12:40 నుండి 2:20 వరకు
దుర్ముహూర్తం:సా.4:26 నుండి 5:14 వరకు తదుపరి
రాహుకాలం:సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గళికా కాలం: మ.3:24 నుండి 4:52 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:58 నుండి ఉ.5:46 వరకు
అమృతఘడియలు:రా.9:19 నుండి 11:00 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:04 నుండి 12:51వరకు

ఈరోజు. (06-03-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది

వృషభం: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలలో మార్గావరోదాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిథునం: ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆర్ధిక పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటకం: చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు..కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

సింహం: దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది.

కన్య: ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

తుల: ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరం అవుతాయి. విద్యార్థులు పరీక్ష ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

ధనస్సు: సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం: మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఋణ యత్నాలు మందగిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మీనం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లక పోవడానికి మంచిది. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

30 COMMENTS

సినిమా

శ్రీతేజ్ ను డిశ్చార్జి చేసిన డాక్టర్లు..

పుష్ప-2 ప్రీమియర్స్ షోలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను తాజాగా డాక్టర్లు డిశ్చార్జి చేశారు. శ్రీతేజ్ గత ఐదు నెలలుగా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు....

బర్త్ డేకి టీజర్.. ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

దేవర 1 తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు...

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు....

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

రాజకీయం

జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస

జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జనసైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీ...

మత్స్యకారుల సేవలో కూటమి.. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..

ఏపీలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అంతకు ముందు వారి గురించి పట్టించుకున్న వారు ఎవరూ లేరు. కానీ టీడీపీ హయంలో నుంచే చంద్రబాబు వారి గురించి ఆలోచిస్తూ వస్తున్నారు. వారిని...

పాకిస్థాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పహల్గాం ఉగ్రాదాడి తర్వాత కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతగా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి...

అమరావతి.! ఈసారి ఆ ‘ఆలస్యం’ అస్సలు వుండదట.!

రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోంది. గతంలో, అంటే 2014 - 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో (అప్పట్లో టీడీపీ - బీజేపీ...

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

ఎక్కువ చదివినవి

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం ఉగ్రదాడితో దేశంలో శాంతిభద్రతల మీద చర్చ...

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే....

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

రెట్రో కోసం రౌడీ వస్తున్నాడు..!

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. సూర్య లీడ్ రోల్ లో...